
తొలివిడతలో 41.37 లక్షల మందికి లబ్ధి వారి ఖాతాల్లో రూ.2,482.02 కోట్లు జమ సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమం ఖమ్మం రైతు ఆశీర్వాద సభ హైదరాబాద్‌కు మార్పు ఈనాడు, హైదరాబాద్: రాష్ట్ర రైతులకు పంట పెట్టుబడి సాయంగా అందించే రైతు భరోసా వానాకాలం సీజన్ నిధులు మంగళవారం విడుదల కానున్నాయి. మొదటి విడత కింద రెండు ఎకరాల వరకు భూమి ఉన్న 41.37 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2,482.02 కోట్లు జమ కానున్నాయి. హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో సాయంత్రం నాలుగు గంటలకు జరిగే రైతు ఆశీర్వాద సభలో సీఎం రేవంత్‌రెడ్డి ల్యాప్‌ట్యాప్‌లో మీట నొక్కి నిధులను విడుదల చేస్తారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర శాసనసభ నియోజకవర్గ పరిధిలోని చింతకానిలో నిర్వహించ తలపెట్టిన రైతు ఆశీర్వాద సభను భారీ వర్షాల కారణంగా రద్దు చేసి.. సీఎం సూచనల మేరకు హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఏర్పాటు చేశారు. ఎకరానికి రూ.ఆరు వేల చొప్పున.. 73.32 లక్షల మంది రైతులకు చెందిన మొత్తం కోటిన్నర ఎకరాలకు రూ.9 వేల కోట్లు దశలవారీగా విడుదల చేయనున్నట్లు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ సందర్భంగా తెలిపారు. తొలి విడతలో రెండు ఎకరాల వరకు భూమి ఉన్న 41.37 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2,482.02 కోట్లు జమ చేస్తాం అన్నారు. ఈ నిధుల విడుదలపై ప్రభుత్వం ముంబయిలోని రిజర్వ్ బ్యాంకు కార్యాలయానికి, హైదరాబాద్‌లోని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ(ఎస్‌ఎల్‌బీసీ)కి, అన్ని బ్యాంకులకు ఈ నెల 27నే సమాచారం అందజేసింది. రుణ బకాయిల కింద మినహాయించుకోకుండా రైతుల ఖాతాల్లో ఈ భరోసా నిధులు పూర్తిగా జమ చేయాలని బ్యాంకులకు స్పష్టంగా సూచించింది. ‘‘రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే వర్షాలు విస్తరిస్తుండటం, రైతులు విత్తనాలు వేసే కీలక సమయం కావడంతో పెట్టుబడి సాయాన్ని సకాలంలో రైతుల ఖాతాల్లో జమ చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. శిల్పకళా