రైతు భరోసా’ నిధుల జమ వేళ కొత్త ట్విస్ట్
Actor ProfilePolitician

రైతు భరోసా’ నిధుల జమ వేళ కొత్త ట్విస్ట్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
రైతు భరోసా’ నిధుల జమ వేళ కొత్త ట్విస్ట్ - ఇక వారికి మాత్రమే నిధులు
Oneindia Telugu6 Jul 2026
రైతు భరోసా’ నిధుల జమ వేళ కొత్త ట్విస్ట్ - ఇక వారికి మాత్రమే నిధులు

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వానాకాలం సాగు పనులు ప్రారంభమయ్యాయి. ఇదే సమయంలో ఈ నెల 30న రైతు భరోసా కింద నిధులను విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ఈ సారి ఒకే విడతలో నిధులు విడుదల చేస్తామని చెబుతున్న ప్రభుత్వం కొత్త నిర్ణయాలతో సిద్దం అవుతోంది. దీంతో.. నిధుల విడుదలకు మార్గదర్శకాలను ఖరారు చేసారు. తాజా నిర్ణయాలు ఇప్పుడు కొత్త చర్చకు కారణం అవుతోంది.రైతు భరోసా నిధుల విడుదలకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నెల 30వ తేదీ ముహూర్తంగా నిర్ణయించింది. దాదాపు రూ 9 వేల వరకు విడుదల దిశగా నిధులు సమీకరిస్తోంది. ఈసారి దశలవారీగా కాకుండా ఒకేసారి నిధులను విడుదల చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తొమ్మిది రోజుల్లో అర్హులైన రైతులందరికీ పథకం నిధులు జమ చేసేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. కొత్త పట్టదార్ పాసు పుస్తకాలు పొందిన వారితో కలుపుకొని సుమారు 73లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు సమాచారం. గత యాసంగి సీజన్లో కేవలం రెండు ఎకరాల వరకు మాత్రమే పెట్టుబడి సాయం అందించడంతో రైతుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం. పెద్ద రైతుల కంటే చిన్న, సన్న కారు రైతులకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. జమిలి, డీలిమిటేషన్ ఇక ఖాయం - మోదీ లెక్క పక్కా, ముహూర్తం ఫిక్స్..!!జూన్ 30 న నిధుల విడుదలకాగా, ఏడున్నర ఎకరాలలోపు భూమి కలిగిన రైతులకు మాత్రమే సాయం అందించే ప్రతిపాదనపై చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇకపై కేవలం పట్టాదారు పాస్‌బుక్ ఉండటమే కాకుండా, వాస్తవంగా పంట సాగు చేస్తున్న రైతులకే రైతు భరోసా అందించాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పథకం అమలులో శాటిలైట్ సర్వే కీలక