
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. KTR Vemulawada speech Telugu News: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆనాడు కెసిఆర్ ఒంటరిగా బయలుదేరి.. అందరినీ కలుపుకొని రాష్ట్రాన్ని సాధించారు.. నేడు బీఆర్ఎస్ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం భయభ్రాంతులకు గురిచేస్తోంది.. దేనికి భయపడకండి. మీ వెనుక నేను.. చల్మెడ లక్ష్మీనరసింహారావు ఉన్నాం.. అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కలవకుంట్ల తారక రామారావు పిలుపునిచ్చారు.. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ కార్యకర్తల విస్తృతస్థాయి సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి చెల్మెడ లక్ష్మీనరసింహారావు, సభ్యత్వ నమోదు ఇన్చార్జి ప్రవీణ్, మాజీ చైర్పర్సన్ తుల ఉమా తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో SIR ప్రక్రియ.. బూత్ కార్యకర్తలే సైనికులు.. దేశంలో 13 సార్లు స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో లేదా ప్రత్యేక సర్వేల రూపంలో ఓటర్ల పరిశీలన జరిగినప్పుడు వేములవాడ లేదని కేటీఆర్ గుర్తు చేశారు. జూన్ 25 నుంచి జూలై 25 వ తేదీ వరకు నెల రోజులపాటు అధికారికంగా 2002 తో పాటు 2025 ఓటర్ల జాబితాలను పక్క పక్కన పెట్టి ఫ్యామిలీ మ్యాపింగ్ చేయనున్నారని తెలిపారు.. ఇంటికి వచ్చే అధికారులు.. చనిపోయిన వారి ఓట్లను, రెండు చోట్ల ఉన్న ఓట్లను తొలగిస్తారని.. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ అనుకూల ఓట్లు పోకుండా బూత్ స్థాయి కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వేములవాడలో చల్మెడ లక్ష్మీనరసింహారావు విజయం పక్కా అని