
అరుణ మహరాజు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. స్పోర్ట్స్, లైఫ్‌స్టైల్, హెల్త్, వినోదం, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Ap, Telangana Rain Alert: నేడు ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉంటుందని.. ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే సూచనలు ఉన్నాయని తెలిపింది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, నెల్లూరు జిల్లాలతో పాటు.. రాయలసీమ వ్యాప్తంగా కొన్ని చోట్ల స్వల్ప వ్యవధిలోనే భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఈ వర్షాల సమయంలో బలమైన ఈదురుగాలులు వీయడంతో పాటు పిడుగులు పడే ప్రమాదం ఉందని అధికారులు వెల్లడించారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో నేడు, రేపు కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, గద్వాల జిల్లాల్లో సోమవారం భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. అలాగే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో వడగాల్పులు వీస్తాయని తెలిపింది. మరోవైపు వికారాబాద్ జిల్లా మొమిన్‌పేట్‌లో అత్యధికంగా 6.8, సంగారెడ్డి జిల్లా ఝరాసంఘంలో 5.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ క్రమంలో పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, బహిరంగ ప్రదేశాల్లో ఉండే వారు ఉరుములు ప్రారంభం కాగానే సురక్షిత భవనాల్లోకి వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. పొరపాటున కూడా చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, నీటి వనరుల సమీపంలో నిల్చోవద్దని గట్టిగా హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు, వాహనదారులు కూడా ప్రయాణాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ కోరింది. వరద నీరు ప్రవహించే