
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ACB Operation With Farmer: వ్యవసాయం చేసుకునే రైతు తన పొలానికి చెరువు నుంచి మట్టి తోలుకునేందుకు సాగునీటి ఇంజనీర్‌ను సంప్రదించగా.. అతడు పెద్ద ఎత్తున లంచం ఆశించాడు. పొలం పనులు చేసుకునే రైతుకు భారీ స్థాయిలో లంచం ఇచ్చుకునే స్తోమత లేదు. దీంతో అతడు వెంటనే అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులను సంప్రదించాడు. ఏసీబీ అధికారుల ఆదేశాలతో లంచంగా డబ్బులు ఇచ్చాడు. ఆ వెంటనే ఏసీబీ అధికారులు దాడులు చేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో జరిగింది. అయితే ఆ రైతు ఇప్పటికే ఒక అధికారిని ఏసీబీకి పట్టించగా.. తాజాగా రెండో అధికారిని కూడా ఏసీబీకి అప్పగించాడు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏసీబీ వరుస దాడులు కొనసాగుతున్నాయి. ఈ రోజు అశ్వారావుపేటలో ఇరిగేషన్ ఏఈఈ ఎల్. శ్రీనివాస్ రూ.రెండు లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అశ్వారావుపేట పట్టణంలోని దొంతికుంట చెరువు నుంచి ఓ రైతు తన పొలానికి మట్టి తోలుకునేందుకు అనుమతి కోరగా.. ఏఈఈ శ్రీనివాస్ రూ.రెండు లక్షలు డిమాండ్ చేశాడు. ఆ డబ్బులు ఇస్తూ రైతు ఏసీబీ అధికారులకు పట్టించాడు. మట్టి తోలుకునేందుకు అశ్వారావుపేటలోని ఏఈ తన కార్యాలయంలో రైతు నుంచి రూ.రెండు లక్షల నగదు స్వీకరిస్తుండగా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఏసీబీ డీఎస్‌పీ వై. రమేష్ నేతృత్వంలోని బృందం దాడి చేసి ఏఈఈని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచనున్నారు. '2 లక్షలు లంచం తీసుకుంటుండగా ఇరిగేషన్ ఏఈని