పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవేటెడ్ మూవీ ‘దే కాల్ హిమ్ ఓజీ’ (OG) కోసం మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. థమన్ ప్లాన్ చేసిన 'ఓజీ టూర్ ఇండియా' లైవ్ కన్సర్ట్‌కు ఊహించని ఆటంకం ఎదురైంది. హైదరాబాద్ వేదికగా జరగాల్సిన ఈ భారీ మ్యూజికల్ నైట్ చివరి నిమిషంలో వాయిదా పడటంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. నగరంలోని బౌల్డర్ హిల్స్ వేదికగా శనివారం సాయంత్రం ఎంతో వైభవంగా ప్రారంభం కావాల్సిన ఈ ఈవెంట్‌పై వరుణుడు నీళ్లు చల్లాడు. మధ్యాహ్నం నుంచి కురిసిన కుండపోత వర్షం, ఈదురుగాలుల కారణంగా కన్సర్ట్ ప్రాంగణం పూర్తిగా జలమయమైంది. ప్రేక్షకుల రక్షణను దృష్టిలో ఉంచుకుని, అలాగే కొన్ని కీలకమైన సంగీత పరికరాలు తడిసిపోవడంతో వేడుకను రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు. ఈ అన్-ఎక్స్‌పెక్టెడ్ షాక్‌తో సంగీత దర్శకుడు థమన్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ఈ వార్త తన హృదయాన్ని ముక్కలు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత 45 రోజులుగా తన టీమ్‌లోని 56 మంది సభ్యులు రాత్రింబగళ్లు కష్టపడ్డారని, కానీ ప్రకృతి మన చేతుల్లో ఉండదని పేర్కొన్నారు. భగవంతుడిపై తనకు నమ్మకం ఉందని, అభిమానుల ప్రేమాభిమానాలతో మరింత పవర్‌ఫుల్‌గా తిరిగి వస్తానని థమన్ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. నిజానికి ఈ 'ఓజీ' మ్యూజికల్ కాన్సెప్ట్ వాయిదా పడటం ఇది రెండోసారి. తొలుత జూన్ 6వ తేదీనే ఈ ఈవెంట్ జరగాల్సి ఉన్నప్పటికీ, అప్పుడు కూడా ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్లే పోస్ట్‌పోన్ అయింది. ఇప్పుడు మరోసారి వర్షం వల్ల షో క్యాన్సిల్ కావడంతో సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్ అటు థమన్ టీమ్‌కు మద్దతుగా నిలుస్తూనే, తమ బ్యాడ్ లక్‌పై కామెంట్లు పెడుతున్నారు. నందమూరి బాలకృష్ణ, కొరటాల శివ క్రేజీ కాంబో.. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా
Actor ProfileActor
రెండోసారి కూడా 'ఓజీ' మ్యూజికల్ ఈవెంట్ కు బ్రేక్.. ఆవేదనలో థమన్
Total News1
Movie Updates0
Sources1
TeluguOne•14 Jun 2026
రెండోసారి కూడా 'ఓజీ' మ్యూజికల్ ఈవెంట్ కు బ్రేక్.. ఆవేదనలో థమన్