రెండు సినిమాలకు ఎన్నో యుద్ధాలు చేశాం
Actor ProfileActor

రెండు సినిమాలకు ఎన్నో యుద్ధాలు చేశాం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
రెండు సినిమాలకు ఎన్నో యుద్ధాలు చేశాం
Eenadu14 Aug 2026
రెండు సినిమాలకు ఎన్నో యుద్ధాలు చేశాం

ఇంటర్నెట్‌ డెస్క్: విజయ్‌ దేవరకొండ హీరోగా రాహుల్ సాంకృత్యాన్‌ దర్శకత్వంలో రానున్న చిత్రం ‘రణబాలి’. నేడు రాహుల్‌ పుట్టినరోజు సందర్భంగా విజయ్‌ (Vijay Deverakonda) ఆయనకు విషెస్‌ చెప్పారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘టాక్సీవాలా’ను గుర్తుచేసుకున్నారు. ‘‘టాక్సీవాలా’ వచ్చి తొమ్మిదేళ్లు దాటింది. ఈ తొమ్మిదేళ్లలో మనమిద్దరం ఎన్నో విషయాల్లో ఎదిగాం. అర్థవంతమైన కథలు రాయాలి.. ప్రేక్షకులను అలరించాలనే నీ పట్టుదలలో.. నీ పాత్రకు ప్రాణం పోయాలనే నా తపనలో ఎలాంటి మార్పూ రాలేదు. మనం కలిసి చేసింది కేవలం రెండు సినిమాలే.. అయినా వాటి కోసం ఎన్నో యుద్ధాలు చేశాం. ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నాం. అన్ని అడ్డంకుల మధ్య విడుదలైన మన మొదటి సినిమా (Taxiwaala) ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంది. ఇప్పుడు రెండో చిత్రానికి కూడా నేను నీకు తోడుగా ఉన్నాను. మనం మళ్లీ ఆ ప్రేక్షకాదరణను పునరావృతం చేద్దాం. విజయాన్ని అందుకుందాం’’ అని విజయ్‌ దేవరకొండ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. రాహుల్‌ సినిమాలో భాగమవడం తనకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నట్లు విజయ్‌ తెలిపారు. ఆయన (Rahul Sankrityan) పనితనాన్ని ప్రపంచం చూడబోతున్నందుకు ఎంతో ఉత్సాహంగా ఉందని పేర్కొన్నారు. విజయ్‌ దేవరకొండకు జోడీగా రష్మిక నటిస్తోన్న ఈ సినిమా సెప్టెంబర్‌ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. 1854 నుంచి 1878 మధ్యకాలంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ‘రణబాలి’ చిత్రం రూపొందుతోంది. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు