రెండేళ్లలో 500 నగరాలకు భారత్ ట్యాక్సీ’ సేవలు
Actor ProfilePolitician

రెండేళ్లలో 500 నగరాలకు భారత్ ట్యాక్సీ’ సేవలు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
రెండేళ్లలో 500 నగరాలకు భారత్ ట్యాక్సీ’ సేవలు
Andhra Jyothy2 Aug 2026
రెండేళ్లలో 500 నగరాలకు భారత్ ట్యాక్సీ’ సేవలు

హోం మంత్రి అమిత్ షా గుజరాత్‌లో భారత్ ట్యాక్సీ సేవలను ప్రారంభించారు. కోపరేటివ్ మోడల్‌లో డ్రైవర్లే భాగస్వాములుగా ఉండే ఈ యాప్‌ ప్రారంభం వేడుకల్లో హోం మంత్రి ప్రసంగిస్తూ ట్యాక్సీ సేవలు ప్రస్తుతం నిత్యావసరంగా మారాయని అన్నారు. ఇంటర్నెట్ డెస్క్: హోం మంత్రి అమిత్ షా గుజరాత్‌లో తాజాగా భారత్ ట్యాక్సీ సేవలను ప్రారంభించారు. కోపరేటివ్ మోడల్‌లో డ్రైవర్లే భాగస్వాములుగా ఉండే ఈ యాప్‌ ప్రారంభ వేడుకల్లో హోం మంత్రి ప్రసంగిస్తూ ట్యాక్సీ సేవలు ప్రస్తుతం నిత్యావసరంగా మారాయని అన్నారు. ఇటీవల కాలంలో ఈ రంగం గణనీయంగా విస్తరించిందని అన్నారు. ప్రస్తుతం ద్విచక్రవాహనాలు కూడా బైక్ ట్యాక్సీలుగా కుంభమేళా లాంటి భారీ ఈవెంట్స్‌లో ఉపయోగపడుతున్నాయని చెప్పారు. రెండేళ్లల్లో 500 నగరాలకు ఈ ట్యాక్సీ సేవలు విస్తరిస్తాయని చెప్పారు. ఈ సందర్భంగా ప్రైవేటు రైడ్ హెయిలింగ్ యాప్స్‌పై కూడా విమర్శలు గుప్పించారు. కార్పొరేట్ యాప్‌లు ఒక క్రమపద్ధతితో శ్రమదోపిడీ చేస్తున్నాయని విమర్శించారు. రవాణా ఆపరేటర్లను డ్రైవర్లుగా పిలవడం కంటే సారథులని పిలుస్తానని చెప్పారు. ప్రైవేటు ఆపరేటర్లే అధిక శాతం లాభాలు దండుకుని వర్కర్లను వేధించిన ఘటనలు ఉన్నాయని అన్నారు. భారత్ ట్యాక్సీ‌లో ఇలాంటి శ్రమదోపిడీ ఉండదని హోం మంత్రి హామీ ఇచ్చారు. ఒక న్యాయమైన ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని అన్నారు. వినియోగదారులు, డ్రైవర్లకు ఎలాంటి నష్టం చేకూర్చని వ్యవస్థ ఇదేనని అన్నారు. ఇప్పటికే 7 లక్షల మంది డ్రైవర్లు ఈ యాప్‌లో భాగస్వాములయ్యారని అన్నారు. సుస్థిర ఆర్థిక భద్రతను సొంతం చేసుకున్నారని అన్నారు. భారత్ ట్యాక్సీలో రేట్లు ఎక్కువగా ఉన్నాయన్న వాదనలను కూడా హోం మంత్రి కొట్టిపారేశారు. ప్రత్యర్థి యాప్‌లు కావాలనే వ్యూహాత్మకంగా తమ ధరలను తగ్గిస్తున్నాయని కూడా హోం మంత్రి ఆరోపించారు. ఈ యాప్‌ను మార్కెట్ నుంచి తప్పించేందుకు ఈ వ్యూహాన్ని అమలు చేస్తున్నారని ఆరోపించారు. ‘వాళ్లు ఇలా ఎంతకాలం చేయగలరు? భారత్ ట్యాక్సీ అలసిపోదు, యుద్ధ మైదానాన్ని వీడదు. నిలిచి పోరాడుతుంది. విజయం సాధిస్తుంది’