రెండేళ్ల తర్వాత.. కొత్తగా.. శ్రద్ధగా
Actor ProfileActor

రెండేళ్ల తర్వాత.. కొత్తగా.. శ్రద్ధగా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
రెండేళ్ల తర్వాత.. కొత్తగా.. శ్రద్ధగా
Eenadu20 Jul 2026
రెండేళ్ల తర్వాత.. కొత్తగా.. శ్రద్ధగా

‘స్త్రీ 2’ తర్వాత రెండేళ్లు తెరపై కనిపించలేదు బాలీవుడ్ కథానాయిక శ్రద్ధా కపూర్‌. ఇప్పుడు ‘ఈథా’తో త్వరలో ప్రేక్షకుల్ని పలకరించనుంది. ఈ సినిమా టీజర్‌ ఇటీవల విడుదలైంది. మహారాష్ట్రకు చెందిన జానపద నృత్య కళాకారిణి విఠాబాయి భావు మాంగ్‌ నారాయణ్‌గావ్కర్‌ జీవితం ఆధారంగా ‘ఈథా’ తెరకెక్కుతోంది. గత రెండేళ్లుగా శ్రద్ధ తెరపైనే కాదు.. సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా లేదు. అయినా, ఆమెకున్న క్రేజ్‌ ఏ మాత్రం తగ్గలేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువ మంది ఫాలోవర్స్‌ ఉన్న భారత సెలబ్రిటీల్లో శ్రద్ధ (93.1 మిలియన్‌)తో మూడో స్థానంలో ఉంది. శ్రద్ధకు 16 ఏళ్ల వయసు ఉన్నప్పుడు 2005లో సల్మాన్‌ ఖాన్‌ ‘లక్కీ..’ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. చదువు ఆపకూడదని ఆఫర్‌ను తిరస్కరించింది. ఈ భామ.. శక్తికపూర్‌ కుమార్తె అని అందరికీ తెలుసు. కానీ, ఆమె ప్రముఖ గాయకులు లత మంగేష్కర్‌, ఆశా భోంస్లేకి దగ్గరి బంధువు కూడా. నటిగా స్టార్‌డమ్‌ సంపాదించిన శ్రద్ధ.. మంచి సింగర్‌. గలియాన్‌, బెజుబాన్‌ ఫిర్‌ సే తదితర పాటలు పాడి ఆకట్టుకుంది. అవి చార్ట్‌బస్టర్‌గా నిలిచాయి. ఈ మధ్య డబ్బింగ్‌ ఆర్టిస్టుగానూ మారింది. ‘జూటోపియా 2’ యానిమేషన్‌లో చిత్రంలోని ప్రధాన పాత్రకు హిందీలో ఈమెనే డబ్బింగ్‌ చెప్పింది. జంతు ప్రేమికురాలు, వాటి హక్కుల కోసం పోరాడుతోంది. గతంలో శ్రద్ధను హాటెస్ట్‌ వెజిటేరియన్‌ సెలబ్రిటీ అని పెటా ఇండియా పేర్కొంది. సెలబ్రిటీ కుమార్తె అయినా చదువుకునే రోజుల్లో పార్ట్‌ టైం జాబ్‌ చేసింది. బోస్టన్‌లో ఉండగా.. పాకెట్‌ మనీ కోసం ఓ కాఫీ షాప్‌లో పని చేసింది. విమర్శలు ఓకే.. బాగా ట్రోల్‌ చేస్తే బ్లాక్‌ చేస్తా!