రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతి
Actor ProfilePolitician

రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతి
Andhra Jyothy18 Jun 2026
రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతి

మేడ్చల్ పోలీస్‌ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, కారు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. తుర్కపల్లి - మురహరిపల్లి వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మేడ్చల్, జూన్ 18: మేడ్చల్ పోలీస్‌ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, కారు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. తుర్కపల్లి - మురహరిపల్లి వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కరీంనగర్ నుంచి హైదరాబాద్ వస్తున్న ఓ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఆపై ఎదురుగా వస్తున్న లారీని కారు బలంగా ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందిన వెంటనే మేడ్చల్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. కారులో నుంచి మృతదేహాలను వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ప్రమాదధాటికి హైవేపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు యత్నిస్తున్నారు. ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. స్కూల్‌పై దాడి.. ఎవరూ కావాలని చేయలేదు: ట్రంప్ ఈ-స్టాంప్‌ కేసు పురోగతిపై నివేదిక ఇవ్వండి