రిటైర్మెంట్ ముంగిట పోస్టింగ్.. ఐఏఎస్ శ్రీలక్ష్మీ హ్యాపీ.. ప్రభుత్వం హ్యాపీ
Actor ProfilePolitician

రిటైర్మెంట్ ముంగిట పోస్టింగ్.. ఐఏఎస్ శ్రీలక్ష్మీ హ్యాపీ.. ప్రభుత్వం హ్యాపీ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
రిటైర్మెంట్ ముంగిట పోస్టింగ్.. ఐఏఎస్ శ్రీలక్ష్మీ హ్యాపీ.. ప్రభుత్వం హ్యాపీ
Samayam Telugu25 Jul 2026
రిటైర్మెంట్ ముంగిట పోస్టింగ్.. ఐఏఎస్ శ్రీలక్ష్మీ హ్యాపీ.. ప్రభుత్వం హ్యాపీ

సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మీ మరో నాలుగు రోజుల్లో రిటైర్ కాబోతున్నారు. దీంతో రెండేళ్లుగా పదవి కోసం ఎదురు చూస్తోన్న ఆమెకు ప్రభుత్వం ఊరట కల్పించింది. స్పెషల్ చీఫ్ సెక్రటరీ పదవిని అప్పగించింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆమె గౌరవంగా తన కెరీర్‌కు ముగింపు పలకనున్నారు. సివిల్ సర్వీసెస్ నిబంధనల ప్రకారం ఆలిండియా అధికారులు సస్పెన్షన్లో లేకపోతే, ఏదో ఒక పోస్టింగ్ ఇచ్చే గౌరవంగా రిటైరయ్యే అవకాశాన్ని ప్రభుత్వాలు కల్పించాల్సి ఉంటుంది. ఈ రూల్ ప్రకారమే ప్రభుత్వం ఐఏఎస్ శ్రీలక్ష్మీకి పదవిని ఇచ్చింది. తద్వారా ఆమె సర్వీస్‌ను గౌరవించడంతోపాటు.. తమ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం లేదనే సంకేతాలు పంపించింది. ఈ నిర్ణయంతో ఆలిండియా ర్యాంక్ అధికారుల్లో ప్రభుత్వం పట్ల సానుకూలత వ్యక్తం అయ్యే అవకాశం ఉంది.సీనియర్ అధికారులు ఆరోపణలను ఎదుర్కోవాల్సి రావడం, దీంతో సస్పెన్షన్‌కు గురి కావడం లేదా పోస్టింగ్ కోసం ఎదురు చూడాల్సి రావడం అనేది ఇటీవలి కాలంలో అరుదైన విషయమేం కాదు. రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వర రావు సైతం పదవీ విరమణకు ఒక్క రోజు ముందు ప్రింటింగ్, స్టేషనరీ డీజీగా నాటి జగన్ సర్కారు బాధ్యతలు అప్పగించింది. అయితే ఇందుకోసం ఆయన న్యాయపోరాటం చేయాల్సి వచ్చింది.సీనియర్ ఐఏఎస్‌లు కేఎస్ జవహర్ రెడ్డి, పూనం మాలకొండయ్య లాంటి వారికి సైతం రిటైర్మెంట్ ముంగిట ఇలాగే పోస్టింగ్‌లు లభించాయి. జగన్ సర్కారుకు అనుకూలంగా పని చేశారనే ఆరోపణలు గతంలో వీరిపై టీడీపీ, జనసేన నేతలు ఆరోపించారు. కానీ కూటమి ప్రభుత్వం రెండేళ్ల క్రితం రిటైర్మెంట్ ముంగిట వీరికి పోస్టింగ్‌లు ఇచ్చి హుందాగా వ్యవహరించింది. ఏ అధికారి అయినా ఒక పోస్టులో ఉండి రిటైర్ అయితే పదవీ విరమణ అనంతరం దక్కే ప్రయోజనాలు పొందేందుకు పెద్దగా చిక్కులు ఎదురవవు. సర్వీస్‌లో యాక్టివ్‌గా ఉండి రిటైర్ అయితే నో డ్యూ సర్టిఫికెట్లు పొందడం, పెన్షన్ మంజూరు కావడం సులభం అవుతుంది. ఒకవేళ లూప్