రిటైర్మెంట్ కు 4 రోజుల ముందు.. ఐఏఎస్ శ్రీలక్ష్మికి కీలక పోస్టింగ్.. రెండేళ్ల నిరీక్షణకు తెర
Actor ProfilePolitician

రిటైర్మెంట్ కు 4 రోజుల ముందు.. ఐఏఎస్ శ్రీలక్ష్మికి కీలక పోస్టింగ్.. రెండేళ్ల నిరీక్షణకు తెర

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
రిటైర్మెంట్ కు 4 రోజుల ముందు.. ఐఏఎస్ శ్రీలక్ష్మికి కీలక పోస్టింగ్.. రెండేళ్ల నిరీక్షణకు తెర
Samayam Telugu24 Jul 2026
రిటైర్మెంట్ కు 4 రోజుల ముందు.. ఐఏఎస్ శ్రీలక్ష్మికి కీలక పోస్టింగ్.. రెండేళ్ల నిరీక్షణకు తెర

1988 బ్యాచ్ సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి ఏపీ ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ఆమెను సాధారణ పరిపాలన శాఖ (GAD) స్పెషల్ చీఫ్ సెక్రటరీగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ గురువారం ఉత్తర్వులు వెలువరించారు. పాలనా సంస్కరణల విభాగానికి ఆమెను ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించి.. ఇప్పటి వరకూ అదనపు బాధ్యతలు నిర్వహిస్తోన్న సీనియర్ ఐఏఎస్ షంషేర్ సింగ్ రావత్‌ను రిలీవ్ చేశారు. అయితే, గత రెండేళ్ల నుంచి వెయిటింగ్‌లో పెట్టిన కూటమి ప్రభుత్వం .. రిటైర్మెంట్‌కి నాలుగు రోజుల ముందు ఆమెకు పోస్టింగ్ ఇవ్వడం గమనార్హం. ఈ నెల 30న శ్రీలక్ష్మి పదవీ విరమణ చేయనున్నారు.వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో తెలంగాణ నుంచి వచ్చిన ఆమెకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలో కీలక బాధ్యతలు అప్పగించారు. కానీ, 2024 ఎన్నికల్లో ప్రభుత్వం మారడం, దనంతర పరిణామాలతో దాదాపు రెండేళ్ల పాటు ఆమెకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా హోల్డ్‌లో ఉంచారు. ఇప్పుడు ప్రత్యేక సెక్రటరీగా నియమించడం ఆసక్తికరంగా మారింది.ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన ఓబుళాపురం మైనింగ్ కేటాయింపుల్లో శ్రీలక్ష్మి ఆరోపణలు ఎదుర్కొన్నారు. మాజీ సీఎం జగన్ అక్రమాస్తుల ఆరోపణలపై సీబీఐ నమోదుచేసి కేసులో నిందితురాలిగా ఉన్న ఆమె.. అరెస్టై జైలు జీవితాన్ని కూడా గడిపారు. ఈ సమయంలో ఆమె ఆరోగ్యం కూడా క్షీణించింది. చివరకు బెయిల్‌పై విడుదలైన ఆమె రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ కేడర్‌లో కొనసాగి.. ఆ తర్వాత ఏపీకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఇదే కేసులో తన పేరును తొలగించాలని ఆమె వేసిన డిశ్చార్జ్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు ఈ ఏడాది ఫిబ్రవరిలో కొట్టేసింది.పోస్టింగ్‌తో ఆమెతోపాటు ప్రభుత్వానికీ లాభమే..ఐఏఎస్ శ్రీలక్ష్మీ రెండేళ్లుగా పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్నారు. రిటైర్మెంట్ ముంగిట ఆమెకు పదవి అప్పగించడం ద్వారా తాము కక్ష సాధింపు ధోరణితో లేమని ఆలిండియా సర్వీస్ అధికారులకు ప్రభుత్వం సంకేతం