రూటు మార్చిన పవన్
Actor ProfilePolitician

రూటు మార్చిన పవన్

Total News5
Movie Updates0
Sources1
ఏపీలో వీరికి కొత్త పెన్షన్ల మంజూరు, పంపిణీ ముహూర్తం
Oneindia Telugu17 Jun 2026
ఏపీలో వీరికి కొత్త పెన్షన్ల మంజూరు, పంపిణీ ముహూర్తం

ఏపీల ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పెన్షన్ రూ 4 వేలు పంపిణీ చేస్తోంది. సచివాలయ సిబ్బంది ద్వారా ఇళ్ల వద్దకే పెన్షన్ అందిస్తోంది. కొత్త పెన్షన్ల కోసం

రుషికొండ భనాలు ఇక, కీలక నిర్ణయం
Oneindia Telugu17 Jun 2026
రుషికొండ భనాలు ఇక, కీలక నిర్ణయం

రుషికొండ భవానల వినియోగం పై తుది నిర్ణయం తీసుకునే దిశగా ప్రభుత్వం తుది కసరత్తు చేస్తోంది. విశాఖ లో క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో ఫైనల్ డెసిషన్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది. సబ్ కమిటీ సభ్యులు

మరో ప్రధాన పార్టీ 'లెక్క' సరి చేసిన , లిస్టులో నెక్స్ట్
Oneindia Telugu17 Jun 2026
మరో ప్రధాన పార్టీ 'లెక్క' సరి చేసిన , లిస్టులో నెక్స్ట్

అయిదు రాష్ట్రాల ఎన్నికల తరువాత బీజేపీ నాయకత్వం వేగంగా రాజకీయ అడుగులు వేస్తోంది. తమ చేతికి మట్టి అంటకుండానే పని పూర్తి చేస్తోంది. బెంగాల్ లో మమతా పార్టీ నిలువునా చీలటం తో పాటుగా ఎన్డీఏ కు మద్దతుగా

కాపు' కాస్తున్న వైసీపీ, కీలక మలుపు- గోదావరి గట్టున బిగ్ ప్లాన్
Oneindia Telugu17 Jun 2026
కాపు' కాస్తున్న వైసీపీ, కీలక మలుపు- గోదావరి గట్టున బిగ్ ప్లాన్

ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కూటమి- వైసీపీ మధ్య కొత్త వ్యూహాలు తెర మీదకు వస్తున్నాయి. రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వం ఇక ప్రజల్లోకి తమ విజయాలను తీసుకెళ్లాలని డిసైడ్

రూటు మార్చిన పవన్, జనసేనలోకి వారికి ఆహ్వానం- బాలినేనికి బాధ్యతలు
Oneindia Telugu17 Jun 2026
రూటు మార్చిన పవన్, జనసేనలోకి వారికి ఆహ్వానం- బాలినేనికి బాధ్యతలు

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకుంది. రాజకీయంగా కొత్త వ్యూహాలు సిద్దం చేస్తోంది. అటు మాజీ సీఎం జగన్ ప్రభుత్వం పైన క్రమేణా పోరాటం తీవ్ర తరం చేస్తున్నారు. ప్రజా నిరసనలకు సిద్దం అయ్యారు. ఇటు జనసేనాని పవన్ సైతం రాజకీయంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పార్టీలో చేరికల పైన ఫోకస్ చేసారు. ఇందు కోసం తాజాగా పార్టీ పరంగా తీసుకున్న నిర్ణయం ఆసక్తి కరంగా మారుతోంది.డిప్యూటీ సీఎం.. జనసేనాని పవన్ రాజకీయంగా రూటు మార్చారు. పార్టీ బలోపేతం పైన ప్రత్యేకం గా ఫోకస్ చేసారు. క్షేత్ర స్థాయి నుంచి బలం పెంచుకోవాలని నిర్ణయించారు. ఇందు కోసం పార్టీ లో కొత్త కమిటీల పైన కసరత్తు చేస్తున్నారు. విమర్శలు వస్తున్న కారణంగా నెల్లూరు, ప్రకాశం ఉమ్మడి జిల్లాల పార్టీ కమిటీలను మొత్తంగా రద్దు చేసారు. పార్టీ నేరుగా ఈ రెండు జిల్లాల్లో కార్యకలాపాలను పర్యవేక్షిస్తోంది. జిల్లాల వారీగా పార్టీ సమావేశాలకు పవన్ సిద్దం అవుతున్నారు. ఇదే సమయం లో తెలంగాణ పైనా కసరత్తు చేస్తున్నారు.తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో పోటీ కోసం కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. కాగా.. ఏపీలో జనసేనలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్న ఇతర పార్టీల నేతలు, విద్యావంతులు, సామాజిక వేత్తలు, తటస్థులను చేర్చుకునేందుకు కొత్త కార్యాచరణ ఖరారు చేసారు. వారిని సమన్వయం చేసేందుకు ప్రత్యేకంగా జాయినింగ్స్‌ కమిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం ప్రకటించారు. 14 మంది సభ్యులతో ఏర్పాటైన ఈ కమిటీలో ఎమ్మెల్యేలు బొలిశెట్టి శ్రీనివాస్‌, వంశీకృష్ణ యాదవ్‌, పంతం నానాజీ, ఎంపీ లింగమనేని రమేశ్‌లకు చోటు కల్పించారు.టీడీపీ రెడ్డిగారికి కేంద్రంలో కీలక పదవి..!?పార్టీ బలోపేతం పై పవన్ ఫోకస్వీరితో పాటు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కిలారి రోశయ్య, సామినేని ఉదయభాను, పార్టీ సీనియర్‌ నేతలు కొటికలపూడి చినబాబు, డా.హరిప్రసాద్‌, డా.పెద్దపూడి విజయకుమార్‌, కొరికాన రవికుమార్‌, వంపూరు గంగులయ్య