రాజమండ్రిలో మాలల ఐక్యత చైతన్య యాత్ర.. దండయాత్రకు పిలుపు
Actor ProfilePolitician

రాజమండ్రిలో మాలల ఐక్యత చైతన్య యాత్ర.. దండయాత్రకు పిలుపు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
రాజమండ్రిలో మాలల ఐక్యత చైతన్య యాత్ర.. దండయాత్రకు పిలుపు
HMTV27 Jul 2026
రాజమండ్రిలో మాలల ఐక్యత చైతన్య యాత్ర.. దండయాత్రకు పిలుపు

Rajahmundry: రాజమండ్రిలో మాలల ఐక్యత చైతన్య యాత్ర.. దండయాత్రకు పిలుపు! రాజమండ్రి: మాలలను అణిచివేసే కుట్రలను తిప్పికొడతామనీ మాల మహాసభ అధ్యక్షులు మల్లెల వెంకట రావు హెచ్చరించారు. శుక్రవారం నగరంలోని క్వారీ మార్కెట్ సెంటర్ లోని బి ఎన్ ఆర్ మినీ ఫంక్షన్ హాల్ లో మాజీ కార్పొరేటర్ అజ్జరపు వాసు ఆధ్వర్యాన మాలల ఐక్యత చైతన్య యాత్ర సదస్సు జరిగింది. ఈ సందర్భంగా మల్లెల వెంకట రావు మాట్లాడుతూ రాష్ట్రంలో 80 లక్షల మంది మాలలను ఐక్యం చేసేందుకే హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకూ మాలల ఐక్యత చైతన్య యాత్ర ను ప్రారంభించి నట్లు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం, నేటి కూటమి ప్రభుత్వం మాలలను అణిచివేసే కుట్రలను సాగిస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో మాలలు రాజ్యాంగం ప్రకారం దక్కాల్సిన హక్కులను మాత్రమే కోరుకుంటున్నారని అన్నారు. సుప్రీం కోర్టు తీర్పును అడ్డుగా పెట్టుకుని నేటి కూటమి ప్రభుత్వం ఏ బి సి డి వర్గీకరణ ద్వారా మాలల పై అణచివేత కు పాల్పడుతుందన్నారు. ఉన్న జనాభా ప్రకారం వర్గీకరణ చేస్తే 12 శాతం రిజర్వేషన్ రావాల్సివుందన్నారు. కానీ ప్రభుత్వం మాలలను తక్కువ చేసి మాదిగలకు మేలు చేసేలా వర్గీకరణ చేసిందని ఆరోపించారు. మాలలకు తీరని అన్యాయం జరుగుతున్న మాల జాతి కి చెందిన ఎమ్మెల్యే లు నోరు మెదపడం లేదన్నారు. దళిత క్రైస్తవులుగా ఎస్సీ హోదా కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. స ర్ ద్వారా మాలలకు ఓటు హక్కును లేకుండా కుట్రలు జరుగుతున్నాయని అన్నారు. మాలలు సర్ పట్ల అప్రమంతంగా ఉండాలని, ప్రతి ఒక్క మాల జాతి ఓటును కాపాడుకునేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని పిలుపు ఇచ్చారు. మాలల పై జరుగుతున్న అణిచివేతను తిప్పికొంటేందుకు ఆగస్టు నెలలో విజయవాడ కేంద్రంగా మాలల దండయాత్రతో ప్రభుత్వానికి గుణపాఠం చెబుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జాతీయ అధ్యక్షులు గొల్ల అరుణ్ కుమార్, మాలల