రాజధానికి ఆయన అడుగడుగునా వెన్నుపోటు
Actor ProfilePolitician

రాజధానికి ఆయన అడుగడుగునా వెన్నుపోటు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
రాజధానికి ఆయన అడుగడుగునా వెన్నుపోటు
Telugu Times1 Sept 2026
రాజధానికి ఆయన అడుగడుగునా వెన్నుపోటు

జగన్ రక్తంలోనే వెన్నుపోటు ఉందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర (Dhulipalla Narendra) విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో మావిగన్ (Mavigan) అంశాన్ని వైసీపీ మ్యానిఫెస్టోలో పెడతామని జగన్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో ధూళిపాళ్ల స్పందించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అమరావతి, విశాఖ (Visakha) , మావిగన్ అంటూ రాజధానికి ఆయన అడుగడుగునా వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నారని దుయ్యబట్టారు. జగన్ లాంటి మారీచుల నుంచి కాపాడేందుకే రాజధాని అమరావతికి కేంద్రం రక్షణ కల్పించింది. జగన్ వెన్నుపోటుకు బొత్స ( Botsa), ధర్మాన (Dharmana) తదితర ఉత్తరాంధ్ర నేతలు ఇంకా ఎలా గొడ్డలి పార్టీలో కొనసాగుతున్నారో అర్థం కావట్లేదు. అధికారం పోయినా అహంకారం పోలేదన్నట్లుగా వైసీపీ నేతల వ్యవహారం ఉంది. ఉసరవెల్లి కూడా సిగ్గుపడేలా జగన్ అబద్ధాలు ఉన్నాయి. రాజధాని విషయంలో జగన్ మినహా అన్ని రాజకీయ పార్టీలదీ ఒక్కటే సిద్ధాంతం అని అన్నారు