రాజకీయాల్లోకి సూర్య? క్లారిటీ ఇదే
Actor ProfilePolitician

రాజకీయాల్లోకి సూర్య? క్లారిటీ ఇదే

📊 Box Office Collections
Total News3
Movie Updates0
Sources1
రాజకీయాల్లోకి సూర్య? క్లారిటీ ఇదే
TV9 Telugu31 Aug 2026
రాజకీయాల్లోకి సూర్య? క్లారిటీ ఇదే

తమిళ నాట విజయ్‌ దళపతి పార్టీ పెట్టి.. తన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచింది మొదలు.. కోలీవుడ్ స్టార్ హీరోలు కూడా తమిళ రాజకీయాల్లోకి వస్తున్నట్టుగా వరుసగా వార్తలు వస్తున్నాయి. జీవీ ప్రకాశ్, విశాల్ పేర్లు మరవక ముందే ఇప్పుడు హీరో సూర్య కూడా రాజకీయాల్లోకి వెళుతున్నట్టు ఓ న్యూస్ తమిళ స్టేట్‌లో తెగ వైరల్ అవుతోంది. అందరూ ఈ వార్త గురించే మాట్లాడుకునేలా చేస్తోంది. అయితే ఈ వార్తపైనే సూర్య టీం నుంచి ఓ క్లారిటీ వచ్చిందిప్పుడు. గరం ఫౌండేషన్‌తో ఇప్పటికే తమిళ నాడులో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు సూర్య. దాంతో పాటే.. ‘సూర్య అఖిల భారత అభిమానుల పరిరక్షణ సంఘంగా ఏర్పడిన తన ఫ్యాన్స్‌తో కలిసి పలు విషయాల గురించి సేవా కార్యక్రమాల గురించి మాట్లాడుతుంటారు. ఈ క్రమంలోనే చెన్నైలో జరిగిన ఈ సంఘ సమావేశంలో ఆర్ .వీరమణి మాట్లాడుతూ.. హీరో సూర్య రాజకీయా రంగ ప్రవేశం చేయడం తథ్యం అంటూ చెప్పుకొచ్చారు. యన మాటలను బేస్ చేసుకున్న కోలీవుడ్ మీడియా సూర్య పాలిటిక్స్ లోకి వస్తున్నాడంటూ వార్తను అల్లేశారు. అది కాస్తా విపరీతంగా వైరల్ అయింది. దీంతో రంగంలోకి దిగిన సూర్య టీం.. రాజకీయాల్లోకి రావాలనే ఆలోచనేదీ సూర్యకు లేదని క్లారిటీ ఇచ్చేసింది. వీరమణి చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని తేల్చిచెప్పింది. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవాలనే లక్ష్యంతోనే సూర్య సేవాకార్యక్రమాలు చేస్తున్నారు తప్ప.. మరే ఉద్దేశం దీని వెనక లేదని సూర్య టీమ్ క్లారిటీ ఇచ్చేసింది. Maa Inti Bangaram: గుడ్ న్యూస్.. OTTలోకి ‘మా ఇంటి బంగారం’ మూవీ ఫిల్మ్ ఇండస్ట్రీకి మోదీ గుడ్‌న్యూస్!ఇక ఊరూరా థియేటర్లే! Nandini Reddy: సమంత ప్రెగ్నెంట్ అని తెలిశాకే.. ఆ సీన్లన్నీ షూట్ చేశాం.. OTT గైడ్.. పెద్ది, అబ్సెషన్ తో పాటు.. ఈ వారం ఏం వస్తున్నాయంటే

రాజకీయాల్లో లారెన్స్ యూటర్న్
TV9 Telugu31 Aug 2026
రాజకీయాల్లో లారెన్స్ యూటర్న్

'అమ్మ ఓకే చెప్పింది! నేనూ రెడీ.. రాజకీయాల్లోకి వస్తున్నా అంటూ.. నిన్న కాక మొన్న ఓ వీడియో రిలీజ్‌ చేసిన రాఘవ లారెన్స్‌.. రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చి... దుమ్ములేపుతాడనే తమిళ తంబీలు అనుకున్నారు. విజయ్‌

స్టూడెంట్ చెంపపై కొట్టిన టీచర్ .. పాపం.. ఆ విద్యార్థి చెవికి
TV9 Telugu31 Aug 2026
స్టూడెంట్ చెంపపై కొట్టిన టీచర్ .. పాపం.. ఆ విద్యార్థి చెవికి

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఒక ఉపాధ్యాయుడి నిర్వాకం విద్యార్థి ప్రాణాల మీదికి తెచ్చింది. నికోల్ ప్రాంతంలోని ఓస్కూల్‌లో టీచర్ కొట్టిన చెంపదెబ్బకు పదో తరగతి విద్యార్థి చెవి రంధ్రం తీవ్రంగా దెబ్బతిని