
Telugu Times•12 Jul 2026
రాజకీయాల్లోకి రావాలనుకునేవారు ఆయన ఉపన్యాసాలు వినాలిస్నేహానికి నిలువెత్తు నిదర్శనం మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడని(Venkaiah Naidu) కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy)అన్నారు. హైదరాబాద్‌లో వెంకయ్య నాయకుడు పుస్తకావిష్కరణ కార్యక్రం జరిగింది. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ సమయ పాలనలో ఆయన్ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు. చేపట్టిన ప్రతి పదవికీ వన్నె తెచ్చిన వ్యక్తి వెంకయ్యనాయుడు అని అన్నారు. అసెంబ్లీ (Assembly)లో ఆయన చేసిన ఉపన్యాసాలు అందరికీ ఆదర్శం. తెలుగు రాష్ట్రాల్లో నేతలు గౌరవం తగ్గించే విధంగా మాట్లాడుతున్నారు. రాజకీయాల్లోకి రావాలనుకునే వారు అసెంబ్లీలోని వెంకయ్య ఉపన్యాసాలు వినాలి. రైతులు, గ్రామాలు అంటే ఆయనకు చాలా ఇష్టం. గ్రామీణాభివృద్ధి శాఖ (Department of Rural Development) బాధ్యతలు తీసుకుని గ్రామాలను అభివృద్ధి చేశారు అని అన్నారు