రాజకీయ నేతలు యముడి సింహాసనాన్ని కూడా ఆక్రమిస్తారు.. ప్రొఫెసర్ నాగేశ్వర్ పిట్టకథ
Actor ProfilePolitician

రాజకీయ నేతలు యముడి సింహాసనాన్ని కూడా ఆక్రమిస్తారు.. ప్రొఫెసర్ నాగేశ్వర్ పిట్టకథ

Total News1
Movie Updates0
Sources1
రాజకీయ నేతలు యముడి సింహాసనాన్ని కూడా ఆక్రమిస్తారు.. ప్రొఫెసర్ నాగేశ్వర్ పిట్టకథ
Samayam Telugu14 Jun 2026
రాజకీయ నేతలు యముడి సింహాసనాన్ని కూడా ఆక్రమిస్తారు.. ప్రొఫెసర్ నాగేశ్వర్ పిట్టకథ

గత కొన్ని రోజులుగా దేశంలో పెను సంచలనంగా మారిన నీట్, సీబీఎస్ఈ సహా పలు పరీక్షల పేపర్ లీక్‌ ఘటనలు తీవ్ర దుమారం రేపుతున్న వేళ.. కొత్తగా పుట్టుకొచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇటీవలె ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ఆందోళనలు.. దేశవ్యాప్తంగా సరికొత్త చర్చకు దారి తీశాయి. ఈ క్రమంలోనే ఢిల్లీ తర్వాత ఇతర రాష్ట్రాలకు కూడా కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలు విస్తరించాయి. పేపర్ లీక్‌ ఘటనలకు బాధ్యత వహిస్తూ.. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ.. పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహించిన ధర్నాలో మాజీ ఎమ్మెల్సీ, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ .. ప్రముఖ పర్యావరణ వేత్త, సామాజిక వేత్త సోనమ్ వాంగ్చుక్ సహా చాలా మంది పాల్గొన్నారు. ఈ క్రమంలోనే రాజకీయాలపై, రాజకీయ నేతలపై ప్రొఫెసర్ నాగేశ్వర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశంలో నీట్, సీబీఎస్ఈ సహా పలు ఎగ్జామ్ పేపర్ లీక్స్ జరుగుతుంటే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎక్కడున్నారో తెలియడం లేదని ఆరోపించారు. లాల్ బహదూర్ శాస్త్రి నిజాయితీ నుంచి ప్రస్తుత కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యతారాహిత్యం కారణంగా.. దేశ రాజకీయాలు పూర్తిగా దిగజారిపోయాయని విమర్శించారు. గతంలో ఎక్కడో రైలు ప్రమాదం జరిగితే అప్పటి మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి బాధ్యత వహించి రాజీనామా చేశారని గుర్తు చేశారు. అలాంటి మహానేతల నుంచి ధర్మేంద్ర ప్రధాన్ వరకు రాజకీయాలు దారుణంగా పడిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉల్లి ధరలు పెరిగాయని అడిగితే తాను ఉల్లిగడ్డలు తిననని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారని గుర్తుచేశారు. ఈ క్రమంలోనే మన దేశంలో గతంతో పోలిస్తే