
రాజ్ నిడిమోరు పరిచయం అక్కర్లేని దర్శకుడు. రాజ్ అండ్ డీకే కలిసి ఎన్నో విజయవంతమైన చిత్రాలు, సిరీస్‌లు తెరకెక్కించారు. ‘ది ఫ్యామిలీ మ్యాన్’, ‘ఫర్జీ’ వంటి సూపర్ హిట్స్ ఈ దర్శక ద్వయం నుంచి వచ్చినవే! రాజ్ నిడిమోరు పరిచయం అక్కర్లేని దర్శకుడు. రాజ్ అండ్ డీకే కలిసి ఎన్నో విజయవంతమైన చిత్రాలు, సిరీస్‌లు తెరకెక్కించారు. ‘ది ఫ్యామిలీ మ్యాన్’, ‘ఫర్జీ’ వంటి సూపర్ హిట్స్ ఈ దర్శక ద్వయం నుంచి వచ్చినవే! ప్రస్తుతం ఆయన సమంత కథానాయికగా తెరకెక్కిన ‘మా ఇంటి బంగారం’ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. త్వరలో రాజ్ నిడిమోరు బాలీవుడ్‌లో భారీ చిత్రం తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాజ్ ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ‘ఒక హాలీవుడ్ సినిమా స్ర్కిప్ట్ ఇప్పుడే మొదలైంది, అది ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. మరో సిరీస్‌కు కథ కూడా డెవలప్ అవుతోంది. మా హిందీ సినిమా నిర్మాణం త్వరలో మొదలుకానుంది’ అన్నారు. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తారని, ఆయన ఇందులో సూపర్‌హీరోగా కనిపిస్తారని తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. ఇంతకుముందు కూడా ఈ సినిమా గురించి వార్తలొచ్చాయి. ఈ సినిమాలో రాజ్ భార్య సమంత హీరోయిన్‌గా నటించే అవకాశం ఉందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. రాజ్ టీమ్ ఆ వార్తల్ని ఖండించింది. ప్రస్తుతం సల్మాన్‌ఖాన్ దిల్ రాజు నిర్మాణంలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు