రాజా సింగ్ కేసుల విషయంలో కోర్టు తుది నిర్ణయం
Actor ProfilePolitician

రాజా సింగ్ కేసుల విషయంలో కోర్టు తుది నిర్ణయం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
రాజా సింగ్ కేసుల విషయంలో కోర్టు తుది నిర్ణయం
Oneindia Telugu21 Aug 2026
రాజా సింగ్ కేసుల విషయంలో కోర్టు తుది నిర్ణయం

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన 2022 నాటి వివాదాస్పద వ్యాఖ్యల కేసులో గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే టీ రాజా సింగ్‌కు భారీ ఊరట లభించింది. ఆయనపై నమోదైన ఈ కేసును హైదరాబాద్‌ ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు కొట్టివేసింది. ఆయనపై మోపిన ఆరోపణలు ఏవీ సరైనవి కావని నిర్ధారించిన న్యాయస్థానం రాజాసింగ్‌ను నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది. ఇరుపక్షాల వాదనలు, సాక్ష్యాధారాలను నిశితంగా పరిశీలించిన తర్వాతే కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.మతవిద్వేషాలు రెచ్చగొట్టడం, ఉద్దేశపూర్వకంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం వంటి తీవ్ర ఆరోపణలతో సెక్షన్లు 153ఎ (ఎ) (బి), 295ఎ, 504, 505 (2), 506 కింద మంగళహాట్ పోలీసులు రాజాసింగ్‌ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో మేజిస్ట్రేట్ పోలీస్ రిమాండ్‌ను తిరస్కరించినప్పటికీ అప్పటి ప్రభుత్వం ఆయనపై పీడీ యాక్ట్ ను ప్రయోగించింది. దీనితో ఆయన దాదాపు 77 రోజుల పాటు జైలులోనే గడపాల్సి వచ్చింది.ఈ వివాదం నేపథ్యంలోనే అప్పట్లో బీజేపీ అధిష్ఠానం రాజాసింగ్‌ను పార్టీ నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. తెలంగాణ శాసనసభ ఎన్నికలకు ముందే ఆయనపై ఉన్న సస్పెన్షన్‌ను పార్టీ ఎత్తివేసి మళ్లీ పార్టీలోకి తీసుకుంది. ఈ అక్రమ కేసుల వల్ల ఆయన రాజకీయ ప్రయాణంపై కొంత ప్రభావం పడినప్పటికీ.. ఇప్పుడు లభించిన కోర్టు క్లీన్‌చిట్‌తో ఆయనకు పెద్ద ఎత్తున ఊరట లభించినట్లయింది.కోర్టు తీర్పు వెలువడిన అనంతరం రాజాసింగ్ మీడియాతో మాట్లాడారు. అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం, ఎంఐఎం ఒత్తిడికి తలొగ్గి పోలీసులు తనపై అక్రమంగా కేసులు బనాయించారని ఆరోపించారు. రాజకీయ కక్షసాధింపు చర్యల కోసమే తనను 77 రోజుల పాటు అన్యాయంగా జైల్లో ఉంచారని అన్నారు. తాను ఏనాడూ ఏ మత విశ్వాసాలను లేదా ఇతర దేవుళ్లను కించపరుస్తూ మాట్లాడలేదని, న్యాయవ్యవస్థపై ఉన్న నమ్మకం నేడు నిజమైందని స్పష్టం చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కూడా తనపై కొన్ని అక్రమ కేసులు నమోదయ్యాయని రాజాసింగ్ గుర్తు చేశారు. తాను భయపడబోనని, చట్టరీత్యా