రాజీవ్ కనకాల చెప్పాడు.. నా గర్వంతో చాలా కోల్పోయా
Actor ProfileActor

రాజీవ్ కనకాల చెప్పాడు.. నా గర్వంతో చాలా కోల్పోయా

Total News1
Movie Updates0
Sources1
రాజీవ్ కనకాల చెప్పాడు.. నా గర్వంతో చాలా కోల్పోయా
Sakshi18 Jun 2026
రాజీవ్ కనకాల చెప్పాడు.. నా గర్వంతో చాలా కోల్పోయా

ఒకే ఒక్క సినిమా అతని కెరీర్‌నే మార్చేసింది. ఏకంగా ఆ సినిమా పేరుతోనే ఆయన పిలిచేలా చేసింది. ఆ తర్వాత టాలీవుడ్‌లో పెద్ద హీరోల సినిమాల్లో ఛాన్సులొచ్చాయి. ఒక్క మూవీతో కెరీర్‌ మార్చడమే కాదు.. ఒక నటుడిగా తెలుగు సినీ పరిశ్రమలో గుర్తింపు తీసుకొచ్చింది. ఇంతకీ ఆ నటుడు ఎవరని అనుకుంటున్నారా? అతనే ఉదయ్ కిరణ్ మూవీ చిత్రంతో ఫేమ‍స్ అయిన శీను.. అలియాస్ చిత్రం శీను. చిత్రం శీను అంటే కేవలం కమెడియన్ మాత్రమే.. నటుడిగా తెలుగులో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. హీరోగా కూడా రాణించారు. పొలిమేర చిత్రాల తర్వాత గతేడాది మేఘన అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. తన కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన చిత్ర శీను తాజా ఇంటర్వ్యూలో తన లైఫ్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన గర్వం వల్లే సర్వం కోల్పోవాల్సి వచ్చిందని షాకింగ్ రివీల్ చేశారు. ఒకసారి రాజీవ్ కనకాల నాతో ఓ స్థలం కొంటున్నానని నాతో చెప్పారని చిత్రం శీను తెలిపారు. నేను మణికొండలో ప్లాట్‌ తీసుకుంటున్నా.. నువ్వు కూడా తీసుకో అని అడిగారని గుర్తు చేసుకున్నారు. ఆయనను నేను బావ అని పిలిచేవాడిని.. అప్పుడు నేను చిరంజీవి ఎక్కడ ఉంటారు.. జూబ్లీహిల్స్‌లో కదా.. నేను కూడా అక్కడే కొంటానని రాజీవ్‌తో చెప్పానని అన్నారు. నేను సినిమాలతో ఎప్పుడు బిజీగా ఉంటాననే గర్వంతో ఉండేవాడినని శీను తెలిపారు. అప్పుడు నా వయసు కేవలం 23 ఏళ్లేనని.. అవగాహన లేకనే అలా మాట్లాడానని చిత్రం శీను వివరించారు. నాన్‌స్టాప్ పాలనలో సీఎం విజయ్‌! దొరికిన ఆ కాస్త టైంలోనూ ఇలా..(ఫొటోలు) ప్రకృతి ఒడిలో మైమరపించే జలపాతాలు ఎక్కడో తెలుసా? (ఫొటోలు) విజయవాడ : ఇంద్రకీలాద్రిపై సామూహిక అక్షరాభ్యాసాలు (ఫొటోలు) కడపలో ఏపీఎల్‌ సందడి... పాటలతో ఉర్రూతలూగించిన గాయని సునీత (ఫొటోలు) బెంగళూరులో రష్మిక.. కృతితో కలిసి హడావుడి (ఫొటోలు) మహేష్ బాబు, వంగా మూవీ