
226 మంది ఎంపీల ఆస్తుల విలువ రూ.26,047 కోట్లు... అందులో తెలుగు రాష్ట్రాల్లోని 18 మంది ఎంపీల ఆస్తుల విలువ 39.39% ఎంపీలపై నేరపూరిత కేసులున్న రాష్ట్రాల్లో తొలి స్థానంలో తెలంగాణ ఈనాడు, దిల్లీ: రాజ్యసభ సభ్యుల ఆస్తుల విలువలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 18 మంది ఎంపీలదే 39.39%. మొత్తం 226 మంది సిటింగ్ ఎంపీల ఆస్తుల విలువ రూ.26,047 కోట్లు ఉంటే.. అందులో తెలంగాణకు చెందిన ఏడుగురు ఎంపీల సంపదే రూ.రూ.8,310 కోట్లు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 11 మంది ఎంపీల ఆస్తుల విలువ రూ.1,949 కోట్లు. అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ విషయాల్ని వెల్లడించింది. మొత్తం 233 మంది రాజ్యసభ సభ్యుల్లో 226 మంది (ముగ్గురి అఫిడవిట్లు అందుబాటులో లేవు. పశ్చిమబెంగాల్‌లో 4 స్థానాలు ఖాళీగా ఉన్నాయి) ఆర్థిక, నేర, ఇతర నేపథ్యాల్ని విశ్లేషించింది. కొత్తగా రాజ్యసభకు ఎన్నికైన 27 మంది వివరాల్ని కూడా నివేదికలో చేర్చారు. అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా నివేదిక రూపొందించారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు