
సీనియర్ హీరోయిన్ రోజా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫేమస్ హీరోయిన్. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో అనేక హిట్ చిత్రాల్లో నటించి తనదైన ముద్ర వేశారు. సినీ నటిగా, రాజకీయ నాయకురాలిగా , మాజీ మంత్రిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఎంత బిజీగా ఉన్నప్పటికీ రోజా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను, కుటుంబంతో గడిపిన మధుర క్షణాలను ఆమె తరచుగా నెట్టింట అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అయితే ఎక్కువగా రోజా తనయ అన్షు గురించి ఏదోక పోస్ట్ వైరలవుతూ ఉంటుంది. అన్షు సైతం నెట్టింట చాలా యాక్టివ్. అయితే తాజాగా ఆమె తన కుమారుడు కౌశిక్ ఫోటోస్ షేర్ చేశారు రోజా. తన కొడుకు పుట్టినరోజు సందర్భంగా.. ఇందుకు సంబంధించిన వేడుకల ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు రోజా. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఎక్కువమంది చదివినవి : Tollywood : ఖుష్బూ కూతురి పెళ్లిలో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ సందడి.. స్పెషల్ అట్రాక్షన్‌గా త్రిష.. వీడియోస్ ఇదిగో.. రోజా, సెల్వమణి దంపతులకు ఒక కుమార్తె అన్షుమాలిక, ఒక కుమారుడు (కౌశిక్) ఉన్న సంగతి తెలిసిందే. కౌశిక్ పుట్టినరోజు సందర్భంగా ఇంట్లోనే కుటుంబ సభ్యుల మధ్య ఈ వేడుకలు ఎంతో ఘనంగా, ఆనందోత్సాహాల మధ్య జరిగాయి. ఈ సెలబ్రేషన్స్‌లో రోజా, ఆమె భర్త సెల్వమణి, కుమార్తె అన్షుమాలిక, కౌశిక్ కలిసి కేక్ కట్ చేసి సందడి చేశారు. ఈ ప్రత్యేకమైన రోజున రోజా తన కుమారుడికి ఇన్స్టాగ్రామ్ వేదికగా హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కౌశిక్ తాజా బర్త్‌డే వేడుకల ఫోటోలను జత చేస్తూ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు. "నువ్వు ఈ రోజు ఉన్న వ్యక్తిగా ఎదగడాన్ని చూడటం నా జీవితంలోనే అత్యంత గొప్ప ఆనందం. దేవుడు నీకు మంచి ఆరోగ్యం, సంతోషం