రాఖ్ .. పాతాళ్ లోక్ ’ డైరెక్టర్ కొత్త సిరీస్ ఎలా ఉంది
Actor ProfileActor

రాఖ్ .. పాతాళ్ లోక్ ’ డైరెక్టర్ కొత్త సిరీస్ ఎలా ఉంది

Total News1
Movie Updates0
Sources1
రాఖ్ .. పాతాళ్ లోక్ ’ డైరెక్టర్ కొత్త సిరీస్ ఎలా ఉంది
Eenadu16 Jun 2026
రాఖ్ .. పాతాళ్ లోక్ ’ డైరెక్టర్ కొత్త సిరీస్ ఎలా ఉంది

ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చిన మరో క్రైమ్‌ థ్రిల్లర్‌ వెబ్‌ సిరీస్ ‘రాఖ్‌’ (Raakh Webseries). ‘మీర్జాపూర్‌’ ఫేమ్‌ అలీ ఫజల్‌ ప్రధాన పాత్ర పోషించారు. సోనాలీ బింద్రే, ఆమిర్‌ బషీర్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ‘పాతాళ్‌లోక్‌’తో థ్రిల్‌ చేసిన ప్రొసిత్‌ రాయ్‌ (Paatal Lok Director) ఈ సిరీస్‌కు దర్శకత్వం వహించారు. అమెజాన్‌ప్రైమ్‌ వీడియో వేదికగా స్ట్రీమింగ్‌కు వచ్చిన ఈ సిరీస్‌ ఎలా ఉంది? ఎలాంటి థ్రిల్‌ పంచింది? ఆర్మీలో లెఫ్టినెంట్‌ కర్నల్‌ అశోక్‌ అరోడా (ఆమిర్‌ బషీర్‌), మోనా అరోడా (సోనాలి బింద్రే) దంపతులకు ఇద్దరు పిల్లలు. సుమన్‌ అరోడా (దివ్య శర్మ), సాహిల్‌ అరోడా (వివన్‌ శర్మ) దిల్లీలోని ఓ స్కూల్లో చదువుతూ ఉంటారు. రేడియో స్టేషన్‌లో పాట పాడేందుకు ఇంటి నుంచి వెళ్లిన అక్కాతముళ్లు కనిపించకుండాపోతారు. దీంతో ఎస్సై జయప్రకాశ్‌ జాదవ్‌ (అలీ ఫజల్‌) విచారణ మొదలు పెడతాడు. ఇద్దరు చిన్నారులను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేస్తారు. ఆవారాగా తిరిగే బాబు (ఆకాశ్‌ మఖీజా), రజ్జో(రమణ్‌దీప్‌ యాదవ్‌)లు ఈ దారుణానికి ఒడిగడతారు. ఈ హత్యల వెనుక ఉన్న కారణం ఏంటి? బాబు, రజ్జోల గతం ఎలాంటిది? ఎందుకు నేరస్థులుగా మారారనేది తెలియాలంటే వెబ్‌సిరీస్‌ చూడాల్సిందే! కొన్నేళ్ల కిందట జరిగిన నిర్భయ ఘటన మొదలుకొని చరిత్ర పుటల్నివెనక్కి తిరగేస్తూ వెళ్తే ఒళ్లు గగుర్పాటుకు గురిచేసే హత్యోదంతాలు మన కళ్ల ముందు కనపడుతూ ఉంటాయి. అందరికీ ఇదొక నేర చర్యగా పైకి అనిపించినా, ఆధునిక మానవుడిలో మేల్కొని ఉన్న మృగం తాలూకూ రక్తదాహం కనిపిస్తుంది. 1978లో రంగా- బిల్లా కేసు దేశవ్యాప్తంగా సంచలన సృష్టించింది. ఆ కేసు విచారణ, ఈ సందర్భంగా వెలుగు చూసిన నిజాలు ప్రతి ఒక్కరి వెన్నులో వణుకు పుట్టించాయి. ఆ వాస్తవ సంఘటనల ఆధారంగా దర్శకుడు ప్రొసిత్‌ రాయ్‌ ఆద్యంతం ఉత్కంఠ కలిగించేలా ‘రాఖ్‌’ వెబ్‌సిరీస్‌ను తీర్చిదిద్దడంలో ఫర్వాలేదనిపించారు. పిల్లల కిడ్నాప్‌, హత్యతో