రాఖ్' అమెజాన్ ప్రైమ్ సిరీస్ రివ్యూ
Actor ProfileActor

రాఖ్' అమెజాన్ ప్రైమ్ సిరీస్ రివ్యూ

Total News1
Movie Updates0
Sources1
రాఖ్' అమెజాన్ ప్రైమ్ సిరీస్ రివ్యూ
AP7AM15 Jun 2026
రాఖ్' అమెజాన్ ప్రైమ్ సిరీస్ రివ్యూ

గతంలో అమెజాన్ ప్రైమ్ లో వచ్చిన ' పాతాళ్ లోక్' సిరీస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. సీజన్ వన్ కి దర్శకత్వం వహించిన ప్రోసిత్ రాయ్, తాజాగా 'రాఖ్' సిరీస్ ను అందించాడు. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన సిరీస్ ఇది. సీజన్ వన్ గా 8 ఎపిసోడ్స్ ను వదిలారు. హిందీలో రూపొందిన ఈ సిరీస్, ఈ నెల 12వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అలీ ఫజల్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సిరీస్, తెలుగుతో పాటు ఇతర భాషల్లోను అందుబాటులో ఉంది.ఢిల్లీ నగరంలో కర్నల్ అశోక్ (ఆమీర్ బషీర్) ఫ్యామిలీ నివసిస్తుంటుంది. భార్య మోనా (సోనాల్ బెంద్రే) టీనేజ్ లోకి అడుగుపెట్టిన సుమన్ (దివ్య శర్మ) సోహెల్ (వివాన్ శర్మ) ఇదే అతని కుటుంబం. పాప సుమన్ .. బాబు సోహెల్ ఇద్దరూ చదువుతున్న స్కూల్ లోనే మోనా టీచర్ గా పనిచేస్తుంటుంది. సుమన్ ఆల్ ఇండియా రేడియోలో తరచూ పాటలు పాడుతూ ఉంటుంది.అలాగే ఒక రోజున తమ్ముడు సోహెల్ తో కలిసి ఆమె పాటలు పాడటానికి వెళుతుంది. కానీ ఆ తరువాత ఇద్దరు పిల్లలూ తిరిగిరారు.మిస్సింగ్ కేసును నమోదు చేసిన పోలీసులు రంగంలోకి దిగుతారు. ఈ కేసును సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలనే పట్టదలతో ఎస్ ఐ జయప్రకాశ్ (అలీఫజల్) ఉంటాడు. సిటీకి దూరంగా ఉన్న నిర్మానుష్య ప్రదేశంలో పిల్లలిద్దరి డెడ్ బాడీలు లభిస్తాయి. అత్యంత కృరంగా వాళ్లపై దాడి చేసిన తీరు, ఢిల్లీ నగరాన్ని భయపెడుతుంది. ఓ ప్రముఖ దిన పత్రికలో రిపోర్టర్ గా పనిచేస్తున్న 'నిసార్' కూడా ఆధారాలు సేకరించే పనిలో పడుతుంది. జయప్రకాశ్ ఇన్వెస్టిగేషన్ ముందుకు వెళుతున్నా కొద్దీ, తెరపైకి వచ్చిన రజ్జో (రమణ్ దీప్ యాదవ్) బాబు (ఆకాశ్ మఖిజా) అనే వారి పేర్లు పెద్దవవుతూ ఉంటాయి. ముంబైలో చిల్లర దొంగతనాలు చేస్తూ ఉండే ఈ ఇద్దరే, జరిగిన హత్యలకు