ర క్ష ణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో భేటీ అయిన ముఖ్య మంత్రి రేవంత్
Actor ProfilePolitician

ర క్ష ణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో భేటీ అయిన ముఖ్య మంత్రి రేవంత్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ర క్ష ణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో భేటీ అయిన ముఖ్య మంత్రి రేవంత్
Telugu Times29 Jun 2026
ర క్ష ణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో భేటీ అయిన ముఖ్య మంత్రి రేవంత్

గాంధీ స‌రోవర్ ప్రాజెక్టుకు ర‌క్ష‌ణ శాఖ భూములు బ‌ద‌లాయించినందుకు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు కృత‌జ్ఞ‌తలు తెలిపిన ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్ర ప్ర‌భుత్వ అత్యంత ప్రాధాన్య ప్రాజెక్టుల్లో ఒక‌టైన ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ అభివృద్ధికి సంబంధించి రాష్ట్ర ప్ర‌భుత్వం భూ సేక‌ర‌ణ‌, యుటిలిటీస్ బ‌ద‌లాయింపు వంటి అంశాల్లో పూర్తి స‌హ‌కారం అందిస్తామ‌ని కేంద్ర మంత్రికి తెలిపిన ముఖ్య‌మంత్రి. దేశ స‌మ‌గ్ర‌త‌, ర‌క్ష‌ణ‌కు సంబంధించిన అంశమైనందున రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫున అన్ని విధాలా స‌హాయ‌స‌హ‌కారాలు అందిస్తామ‌ని కేంద్ర మంత్రికి తెలిపిన ముఖ్య‌మంత్రి. ఆదిలాబాద్ లో రానున్న భార‌తీయ వాయు సేన ఎయిర్‌పోర్ట్ ను భారీగా విస్తరిస్తున్న నేప‌థ్యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫున అన్ని విధాలా స‌హ‌క‌రిస్తామ‌ని వెల్ల‌డి. భార‌త వాయుసేన టెర్మిన‌ల్‌తో పాటు ప్ర‌యాణికుల సౌక‌ర్యార్ధం నిర్మించ‌నున్న పౌర విమాన‌యాన శాఖ‌కు చెందిన టెర్మిన‌ల్ బిల్డింగ్‌తో పాటుగా కార్గో, ఎంఆర్‌వో (MRO), హ్యాంగ‌ర్ (HANGER) సౌక‌ర్యాల‌ను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసేలా స‌హ‌క‌రించాల‌ని కోరిన ముఖ్య‌మంత్రి ఇటీవ‌ల మ‌ధ్య ప్రాచ్య ఆసియాలో చోటుచేసుకున్న ప‌రిణామాల నేప‌థ్యంలో ప్ర‌పంచ ప్ర‌సిద్ధిగాంచిన ఎయిర్‌లైన్స్ త‌మ హ్యాంగ‌ర్స్‌ను ఏర్పాటు చేసుకోవ‌డానికి అత్యంత అనుకూల‌మైన ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌ను ఆ దిశ‌గా అభివృద్ధి చేయాల‌ని విజ్ఞ‌ప్తి చేసిన‌ ముఖ్య‌మంత్రి. తెలంగాణ రాష్ట్రంలోని మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా దేవ‌ర‌క‌ద్ర స‌మీపంలో డీఆర్‌డీవో/డీఆర్‌డీఎల్ ఎంచుకున్న ప్ర‌దేశంలో వారికి సంబంధించిన‌ కీల‌క‌మైన‌ ప్రాజెక్ట్‌ను త్వ‌ర‌గా మంజూరు చేయాల‌ని కేంద్ర మంత్రికి విజ్ఞ‌ప్తి చేసిన ముఖ్య‌మంత్రి