రాకా' తో హాలీవుడ్ తో ఢీ! ది పాత్ బ్రేకర్ బన్నీ
Actor ProfileActor

రాకా' తో హాలీవుడ్ తో ఢీ! ది పాత్ బ్రేకర్ బన్నీ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
రాకా' తో హాలీవుడ్ తో ఢీ! ది పాత్ బ్రేకర్ బన్నీ
TV9 Telugu9 Aug 2026
రాకా' తో హాలీవుడ్ తో ఢీ! ది పాత్ బ్రేకర్ బన్నీ

అల్లు అర్జున్.. గంగోత్రి సినిమాతో ఒక సాధారణ హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన ఒక కుర్రాడు.. నిన్న మొన్నటి ‘పుష్ప’ సినిమా వరకు ఎలా ట్రాన్స్‌ఫామ్ అయ్యాడో మన కళ్ల ముందే ఉంది. స్టైలిష్ స్టార్‌గా కెరీర్‌ని బిల్డ్ చేసుకుని.. ఇవాళ నేషనల్ అవార్డ్ విన్నర్‌గా, ‘ఐకాన్ స్టార్‌’గా ఎదిగిన వన్ అండ్ ఓన్లీ హీరో అల్లు అర్జున్. ఇదంతా ఓవర్‌నైట్‌లో వచ్చేసిందా? అంటే ఖచ్చితంగా కాదు! తన అద్భుతమైన స్టోరీ సెలక్షన్.. ఇండస్ట్రీలో ఎవరూ ఎంచుకోని పాత్ బ్రేకింగ్ పాలసీ.. అన్నింటికీ మించి సినిమా అంటే ప్రాణం ఇచ్చే ఒక పిచ్చి.. ఇవే అల్లు అర్జున్‌ని ఈ పొజిషన్‌లో నిలబెట్టాయి. ఇప్పుడు టాలీవుడ్, బాలీవుడ్ మాత్రమే కాదు.. ఏకంగా హాలీవుడ్ మేకర్స్ కూడా షాక్ అయ్యేలా ఒక బిగ్గెస్ట్ అనౌన్స్‌మెంట్ వచ్చింది. అదే.. టాలెంటెడ్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో రాబోతున్న మోస్ట్ యాంబీషియస్ మూవీ ‘రాకా’. 700 నుంచి 900 కోట్ల బడ్జెట్.. మార్వెల్ సినిమాలకు పనిచేసిన హాలీవుడ్ వీఎఫ్ఎక్స్ టీమ్.. మెన్ ఇన్ బీస్ట్‌ లాంటి బన్నీ లుక్! అసలు ఏంటి ఈ ‘రాకా’? పుష్ప తర్వాత బన్నీ మైండ్ సెట్ ఎలా మారింది? అట్లీతో ఈ సినిమా చేయడం వెనుక ఉన్న బిగ్ మాస్టర్ ప్లాన్ ఏంటి? ఈ వీడియోలో కంప్లీట్ ఎనాలసిస్‌ని డీటెయిల్డ్‌గా చూద్దాం. అల్లు అర్జున్ కెరీర్‌ని మనం సింపుల్‌గా రెండు భాగాలుగా విభజించొచ్చు. ఒకటి.. బిఫోర్ పుష్ప.. రెండు.. ఆఫ్టర్ పుష్ప. పుష్ప సినిమా కంటే ముందు వరకు అల్లు అర్జున్ అంటే కేవలం తెలుగు టూ స్టేట్స్ హీరో. లవ్, యాక్షన్, ఫ్యామిలీ డ్రామాలతో సినిమాలు చేస్తూ బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు సాధించేవాడు. కేవలం తన డబ్బింగ్ సినిమాలతో మలయాళంలో కూడా తన మార్కెట్‌ను పెంచుకుని అక్కడ ‘మల్లు అర్జున్’గా క్రేజ్ సంపాదించుకున్నాడు. కానీ ఎప్పుడైతే ‘పుష్ప: ది రైజ్’ మార్కెట్లోకి వచ్చిందో