రూ.500తో ముంబైకి వచ్చి ఇప్పుడు కోట్లు సంపాదించిన కల్కి హీరోయిన్ .. దిశా పటానీ స్టోరీ
Actor ProfileActor

రూ.500తో ముంబైకి వచ్చి ఇప్పుడు కోట్లు సంపాదించిన కల్కి హీరోయిన్ .. దిశా పటానీ స్టోరీ

Total News1
Movie Updates0
Sources1
రూ.500తో ముంబైకి వచ్చి ఇప్పుడు కోట్లు సంపాదించిన కల్కి హీరోయిన్ .. దిశా పటానీ స్టోరీ
Asianet News Telugu13 Jun 2026
రూ.500తో ముంబైకి వచ్చి ఇప్పుడు కోట్లు సంపాదించిన కల్కి హీరోయిన్ .. దిశా పటానీ స్టోరీ

టాలీవుడ్‌ ద్వారా సినిమాల్లోకి అడుగుపెట్టి, ఇప్పుడు బాలీవుడ్‌లో సెటిల్‌ అయ్యింది దిశా పటానీ. చాలా ఏళ్ల తర్వాత ఇటీవల `కల్కి 2898 ఏడీ`లో మళ్లీ టాలీవుడ్‌కి కమ్‌ బ్యాక్‌ ఇచ్చింది. నేడు బర్త్ డే సెలబ్రేట్‌ చేసుకుంటున్న దిశా పటానీ 1992 జూన్ 13న బరేలీలో పుట్టింది. ఈ రోజు గ్లామర్, ఫిట్‌నెస్‌కు మారుపేరుగా నిలిచింది. కానీ ఆమె ప్రయాణం అంత సులువుగా సాగలేదు. తన కలలను నిజం చేసుకోవడానికి ముంబైకి వచ్చినప్పుడు ఆమె దగ్గర కేవలం 500 రూపాయలు మాత్రమే ఉన్నాయట. అయినా, మోడలింగ్‍తో కెరీర్ మొదలుపెట్టి, తన కఠోర శ్రమతో ఇండస్ట్రీలో స్థానం సంపాదించుకుంది. ఈ రోజు దిశా కోట్లాది రూపాయల ఆస్తికి అధిపతిగా ఎదిగింది. బాలీవుడ్‍లో అత్యంత ప్రజాదరణ పొందిన నటీమణులలో ఒకరిగా నిలిచింది. నటనతో పాటు, ఇతర మార్గాల ద్వారా కూడా భారీగా ఆదాయం సంపాదిస్తోంది. 34 ఏళ్ల దిశా పటానీ, బాలీవుడ్‌లో చాలా త్వరగా పేరు తెచ్చుకుంది. ఎందరో పెద్ద స్టార్స్‌తో కలిసి పనిచేసింది. బాలీవుడ్‌లోనే కాకుండా, దక్షిణాది సినిమాల్లోనూ చురుకుగా ఉంది. కేవలం 500 రూపాయలతో ముంబైకి వచ్చిన దిశా, ఇప్పుడు తన కృషితో పెద్ద సామ్రాజ్యాన్నే నిర్మించుకుంది. దిశా మొత్తం ఆస్తి విలువ 75 కోట్ల రూపాయలు. ఆమె వార్షిక ఆదాయం సుమారు 12 కోట్ల రూపాయలు. ముంబైలోని ఖార్ వెస్ట్‌లో ఉన్న 'రుస్తమ్‌జీ పారమౌంట్‌'లో 6 కోట్ల విలువైన 4 BHK అపార్ట్‌మెంట్ ఉంది. అంతేకాకుండా, బాంద్రాలో సముద్రానికి ఎదురుగా మరో విలాసవంతమైన అపార్ట్‌మెంట్ కూడా ఉంది. దిశాకు కార్లంటే చాలా ఇష్టం. ఆమె గ్యారేజీలో మెర్సిడెస్-బెంజ్, రేంజ్ రోవర్ స్పోర్ట్స్, BMW 7 సిరీస్, ఆడి A6 వంటి ఎన్నో ఖరీదైన కార్లు ఉన్నాయి. దిశా పటానీ అనేక మార్గాల ద్వారా భారీగా ఆదాయం సంపాదిస్తోంది. ఆమెకు సినిమాలే అతిపెద్ద ఆదాయ వనరు. ఒక సినిమాలో నటించడానికి ఆమె 5 నుంచి