
హరియాణాలో రెండు వేర్వేరు కేసుల్లో ఐపీఎస్, ఐఏఎస్ అధికారులిద్దరిని సీబీఐ అరెస్ట్ చేసింది. నకిలీ ఔషధాల తయారీ సంస్థ నుంచి రూ.3కోట్లు లంచం తీసుకున్న కేసులో హరియాణా.. న్యూఢిల్లీ, జూలై 1: హరియాణాలో రెండు వేర్వేరు కేసుల్లో ఐపీఎస్, ఐఏఎస్ అధికారులిద్దరిని సీబీఐ అరెస్ట్ చేసింది. నకిలీ ఔషధాల తయారీ సంస్థ నుంచి రూ.3కోట్లు లంచం తీసుకున్న కేసులో హరియాణా కేడర్ ఐపీఎస్ అధికారి దీపక్ గెహ్లావత్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థ అరెస్ట్ చేసింది. బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ రీజనల్ డైరక్టర్ హోదాలో ఉన్న గెహ్లావత్ పుదుచ్చేరికి చెందిన ఓ వ్యాపారిని సీబీఐ దర్యాప్తు చేస్తున్న కేసు నుంచి తప్పిస్తానంటూ రూ.3కోట్లు లంచం డిమాండ్ చేశారు. దర్యాప్తును ప్రభావితం చేసి కేసును అనుకూలంగా మారుస్తానంటూ హామీ ఇవ్వడంతో నిందితులు మధ్యవర్తులతో పాటు హవాలా మార్గంలో డబ్బు ముట్టజెప్పారు. అయితే దర్యాప్తులో భాగంగా లంచం విషయం బయటపడటంతో సీబీఐ గెహ్లావత్ ఆట కట్టించింది. మరో కేసులో ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసిన హరియాణా కేడర్ ఐఏఎస్ అధికారి ప్రదీప్ కుమార్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. హరియాణా కాలుష్య నియంత్రణ సంస్థ కార్యదర్శిగా ఉన్న ప్రదీప్ కుమార్ వివిధ శాఖలకు చెందిన ప్రభుత్వ నిధులను ఐడీఎ్‌ఫసీ ఫస్ట్ బ్యాంకు ఖాతాల ద్వారా అక్రమంగా మళ్లించారు. ప్రభుత్వ ఆర్ధిక నిబంధనలు ఉల్లంఘించి, ఉద్దేశపూర్వకంగా ప్రైవేట్ బ్యాంకుకు అనుచిత ఆర్ధిక ప్రయోజనం కలిగేలా చేశారు. దీంతో ప్రభుత్వానికి రూ.169 కోట్లు నష్టం వాటిల్లిందని సీబీఐ గుర్తించింది. సరిగ్గా పదవీ విరమణ చేసిన రోజే ప్రదీప్ కుమార్‌ను అరెస్ట్ చేసింది. దేశంలోనే అత్యధిక పెన్షన్ల పంపిణీలో ఏపీ రికార్డ్: ఎంపీ కేశినేని శివనాథ్ కృష్ణా తూర్పు డెల్టా కాలువలకు 3200 క్యూసెక్కుల నీరు విడుదల