
మీరు రూ.20,000 లోపు బడ్జెట్‌లో ఒక సూపర్ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ప్రస్తుతం మార్కెట్‌లో మీ బడ్జెట్‌ను దాటకుండానే హై-రెజల్యూషన్ కెమెరాలు, పెద్ద అమోలెడ్ డిస్‌ప్లేలు, ఫాస్ట్ ప్రాసెసర్లు, లాంగ్ లాస్టింగ్ బ్యాటరీల కాంబినేషన్‌తో అదిరిపోయే ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. శామ్‌సంగ్, వివో, పోకో, ఒప్పో, రియల్‌మీ వంటి పాపులర్ బ్రాండ్స్ మిడ్-రేంజ్ ధరల్లోనే ప్రీమియం ఫీచర్లను అందిస్తున్నాయి. సాధారణ యూజర్లు, గేమర్స్, కంటెంట్ క్రియేటర్లకు బెస్ట్ వాల్యూ అందించే టాప్ 5 స్మార్ట్‌ఫోన్ల లిస్ట్ మీకోసం.. వివో T4x 5G ఫోన్ ధర రూ.18,999 గా ఉంది. బ్యాటరీ లైఫ్, ప్రతిరోజూ స్మూత్ పర్ఫార్మెన్స్ కావాలనుకునే వారికి ఇది ఒక పవర్‌ఫుల్ ఛాయిస్. ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.72-ఇంచుల FHD+ LCD డిస్‌ప్లే ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో 44W ఫ్లాష్‌చార్జ్ సపోర్ట్‌తో ఏకంగా 6,500mAh భారీ బ్యాటరీని ఇచ్చారు. డైలీ ఫోటోగ్రఫీ కోసం 50MP ఏఐ రేర్ కెమెరా ఉంది. మరోవైపు, రూ.15,999 ప్రారంభ ధరతో లభిస్తున్న ఒప్పో K14x 5G కూడా గట్టి పోటీ ఇస్తోంది. ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.75-ఇంచుల డిస్‌ప్లే ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రొసెసర్‌తో రన్ అయ్యే ఈ మొబైల్‌లో 50MP డ్యూయల్ రేర్ కెమెరా సెటప్ ఇచ్చారు. ఇందులో కూడా 45W సూపర్‌వూక్ చార్జింగ్‌ను సపోర్ట్ చేసే 6,500mAh బ్యాటరీ ఉంది. తక్కువ బడ్జెట్‌లో పెద్ద బ్యాటరీ, సూపర్ డిస్‌ప్లే, 5G కనెక్టివిటీ కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. రూ.20 వేల లోపు లభించే స్మార్ట్‌ఫోన్లలో శామ్‌సంగ్ గెలాక్సీ A35 5G తన సాఫ్ట్‌వేర్ సపోర్ట్, డిస్‌ప్లే క్వాలిటీతో ప్రత్యేకంగా నిలుస్తుంది. దీని ప్రారంభ ధర రూ.18,999. ఈ ఫోన్‌లో 6.6-ఇంచుల సూపర్ అమోలెడ్ 120Hz డిస్‌ప్లే ఉంది, ఇది విజువల్స్ చూసేటప్పుడు నెక్స్ట్ లెవెల్