
Dubbaka: రూ.10 లక్షల ఉపాధి హామీ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే! దుబ్బాక: సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం హబ్సిపూర్ గ్రామంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రూ.10 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు మరియు డ్రైనేజీ నిర్మాణ పనులకు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధే రాష్ట్ర అభివృద్ధికి పునాది అని పేర్కొన్నారు. గ్రామ ప్రజలకు మెరుగైన రహదారులు, పారిశుద్ధ్య సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. హబ్సిపూర్ గ్రామంలో చేపడుతున్న ఈ సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులు పూర్తయితే గ్రామ ప్రజలకు రాకపోకల సౌకర్యం మెరుగుపడటంతో పాటు పారిశుద్ధ్య సమస్యలు కూడా తగ్గుతాయని తెలిపారు.గ్రామ అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు తమ వంతు కృషి నిరంతరం కొనసాగుతుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను గ్రామంలో చేపట్టేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు