కన్నడ స్టార్ 'రాకింగ్ స్టార్' యష్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా చిత్రం 'టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. 'కేజీఎఫ్ 2' వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత యష్ నుంచి రాబోతున్న ఈ మూవీపై అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారనేది ఇన్నాళ్లూ క్లారిటీ లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో తాజాగా టాక్సిక్ కొత్త విడుదల తేదీని ప్రకటించారు. ‘టాక్సిక్’ సినిమాని ముందుగా 2026 మార్చి 19న థియేటర్లలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేసుకున్నారు. కానీ పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో, చివరి నిమిషంలో వాయిదా వేసుకున్నారు. జూన్ 4న రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. వర్క్ పెండింగ్ ఉండటంతో ఈసారి కూడా చెప్పిన సమయానికి రిలీజ్ చేయలేకపోయారు. దీంతో సినిమా విడుదలపై అనేక వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ ఏడాది రిలీజ్ ఉండకపోవచ్చని, 2027 సంక్రాంతికి వస్తుందనే రూమర్స్ వినిపించాయి. అయితే యష్ సినిమాని ఈ సంవత్సరమే విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. ‘టాక్సిక్’ చిత్రాన్ని 2026 ఆగస్టు 26న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఫాదర్స్ డే సందర్భంగా “నీ తండ్రిని గౌరవించు..” అంటూ రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ పోస్టర్ పంచుకున్నారు. ఇందులో యష్ తండ్రీకొడుకులుగా రెండు పాత్రల్లో కనిపించారు. రాయ, టికెట్ లుక్స్ లో కనువిందు చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా వదిలిన పోస్టర్.. సరికొత్తగా, పవర్ఫుల్ గా ఉంది.‘టాక్సిక్’ చిత్రానికి యష్, గీతూ మోహన్ దాస్ కలిసి కథ అందిస్తున్నారు. ఇందులో నయనతార, కియారా అద్వానీ, రుక్మిణి వసంత్, హ్యూమా ఖురేషి, తారా సుతారియా ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. నేషనల్ అవార్డు విన్నర్ రాజీవ్ రవి
Actor ProfileActor
యష్ ఫాదర్స్ డే సర్ప్రైజ్.. టాక్సిక్’ కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్.. ఈసారైనా చెప్పిన టైమ్ కు వస్తుందా
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•24 Jun 2026
యష్ ఫాదర్స్ డే సర్ప్రైజ్.. టాక్సిక్’ కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్.. ఈసారైనా చెప్పిన టైమ్ కు వస్తుందా