యమధర్మరాజుతో పోరాడే ప్రత్యక్ష దైవాలు.. మూసిన తలుపుల వెనుక డాక్టర్ల కథ ఇది
Actor ProfilePolitician

యమధర్మరాజుతో పోరాడే ప్రత్యక్ష దైవాలు.. మూసిన తలుపుల వెనుక డాక్టర్ల కథ ఇది

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
యమధర్మరాజుతో పోరాడే ప్రత్యక్ష దైవాలు.. మూసిన తలుపుల వెనుక డాక్టర్ల కథ ఇది
Zee Telugu28 Aug 2026
యమధర్మరాజుతో పోరాడే ప్రత్యక్ష దైవాలు.. మూసిన తలుపుల వెనుక డాక్టర్ల కథ ఇది

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Doctors Life In ICU: ఆసుపత్రిలో ఐసీయూ(ICU) అనే మాట వినబడితేనే సాధారణంగా రోగుల బంధువుల గుండెల్లో గుబులు ప్రారంభమవుతుంది.. అక్కడికి వెళ్లిన వారు ప్రాణాలతో తిరిగి వస్తే.. అది ఒక పెద్ద అద్భుతంగా భావిస్తుంటారు. కానీ, ఆ మూసి ఉన్న తలుపుల వెనుక.. యమ ధర్మరాజుతో పోరాడి.. రోగులకు పునర్జన్మ ప్రసాదించే ప్రత్యక్ష దైవాలు మన వైద్యులు.. ప్రతి సెకను క్షణకాలంలా వెళ్లిపోయే, ఆ గదిలో డాక్టర్ల జీవితం ఎలా ఉంటుంది? జాతీయ వైద్యుల దినోత్సవం (Doctors Day 2026) సందర్భంగా ఐసీయూ లోపల వైద్యులు ఎదుర్కొనే సవాళ్లు, వారి అనుభవాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ వార్త కథనం ద్వారా తెలుసుకుందాం.. ప్రతి సెకనూ పోరాటమే.. ఐసీయూ గదిలో పగలు, రాత్రి అనే తేడా ఉండదు.. అక్కడ ప్రతి నిమిషం అత్యంత కీలకమైనదిగా భావిస్తారు. ఏ క్షణంలో ఏ రోగి పరిస్థితి విషమిస్తుందో ఊహించడం కష్టం.. ఎటువంటి అత్యవసర పరిస్థితి ఎదురైనా వైద్యులు గుండె నిబ్బరం కోల్పోకుండా.. సమయస్ఫూర్తితో తక్షణ నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.. ముఖ్యంగా ఒకవైపు రోగి ప్రాణాలు కాపాడే ఒత్తిడి.. మరోవైపు బయట కళ్లల్లో ఒత్తులు వేసుకుని చూసే కుటుంబ సభ్యులకు మేమున్నాం, ధైర్యంగా ఉండండి.. అని భరోసా ఇవ్వడం వైద్యుల జీవితంలో ఒక భాగమైంది.. ఎప్పటికీ విశ్రాంతి లేని గది.. ముంబైకి చెందిన ప్రముఖ సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ పంకజ్ అగర్వాల్ ఐసీయూ లోపలి విశేషాలను వైద్యుల దినోత్సవం సందర్భంగా పంచుకున్నారు.. న్యూరో