
Vaping : ప్రస్తుత యువత, విద్యార్థులలో ‘వేపింగ్’ (Vaping) ఒక పెద్ద ఫ్యాషన్‌గా మారిపోయింది. సాధారణ సిగరెట్ల కంటే ఇది సురక్షితమైనదని, కేవలం స్టైల్ కోసం వాడుతున్నామని చాలా మంది పొరబడుతున్నారు. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), వైద్య నిపుణుల ప్రకారం వేపింగ్ అనేది ఒక తీవ్రమైన ఆరోగ్య ముప్పుగా మారుతుందని హెచ్చరిస్తున్నారు. బ్యాటరీతో పనిచేసే ఎలక్ట్రానిక్ సిగరెట్లు (E-cigarettes), వేప్ పెన్నులు, పాడ్స్ వంటి పరికరాలను ఉపయోగించడాన్ని వేపింగ్ అంటారు. ఇందులో సాధారణ సిగరెట్లలా పొగాకును నేరుగా కాల్చడం జరగదు. బదులుగా, నికోటిన్, కృత్రిమ ఫ్లేవర్లు, ఫార్మాల్డిహైడ్ వంటి హానికరమైన రసాయనాలతో కూడిన ఒక ద్రవాన్ని వేడి చేసి, దాని ద్వారా వచ్చే ఆవిరిని ఊపిరితిత్తుల్లోకి పీలుస్తారు. నిజానికి వేప్ ద్రవాలలో ‘నికోటిన్’ చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది మెదడు ఎదుగుదలను దెబ్బతీసి, యువతను అతి తక్కువ కాలంలోనే దీనికి బానిసలుగా మారుస్తుంది. వేపింగ్ వల్ల రక్తపోటు వేగంగా పెరుగుతుంది. ఇది గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. నికోటిన్ వ్యసనం వల్ల యువతలో ఏకాగ్రత లోపించడం, చిరాకు, ఆందోళన, తీవ్రమైన ఒత్తిడి వంటి మానసిక సమస్యలు తలెత్తుతాయి. వేపింగ్ పూర్తిగా సురక్షితమనే అభిప్రాయానికి ఆధారాలు లేవని, పైగా ఇది ఊపిరితిత్తుల క్యాన్సర్ పెంచే అవకాశం ఉందని పరిశోధకులు కూడా హెచ్చరిస్తున్నారు. అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం డేవిస్ పరిశోధకులు నిర్వహించిన ఈ సమీక్షను కరెంట్ ఆంకాలజీ జర్నల్‌లో ప్రచురించారు. ప్రయోగశాల అధ్యయనాలు, క్లినికల్ పరిశోధనలు, జనాభాపై నిర్వహించిన అనేక అధ్యయనాలను విశ్లేషించిన పరిశోధకులు వేపింగ్ వల్ల శరీరంలో జరిగే జీవసంబంధ మార్పులను పరిశీలించారు. వారి విశ్లేషణలో వేప్ ఏరోసాల్స్‌లో ఫార్మాల్డిహైడ్, అసిటాల్డిహైడ్, అక్రోలిన్, హెవీ మెటల్స్, అతి సూక్ష్మ కణాలు వంటి హానికర రసాయనాలు ఉన్నట్లు గుర్తించారు. ఇవి కణాలను దెబ్బతీయడం, డీఎన్‌ఏలో మార్పులు తీసుకురావడం, దీర్ఘకాలిక వాపును కలిగించడం వంటి పరిణామాలకు దారితీసే అవకాశం ఉందని పేర్కొన్నారు. మరో ఆందోళనకర