యువతే మత్తును చిత్తు చేయాలి
Actor ProfilePolitician

యువతే మత్తును చిత్తు చేయాలి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
యువతే మత్తును చిత్తు చేయాలి
Sakshi26 Jul 2026
యువతే మత్తును చిత్తు చేయాలి

మాదక ద్రవ్యాలు అనగా మానవ శరీరానికి హాని కలిగించే కొన్ని పదార్ధాలు. వీటిని ప్రపంచమంతా డ్రగ్స్ అని వ్యవహరిస్తారు. మాదక ద్రవ్యాల వాడకం ఒక ప్రమాదమైన వ్యసనము (ఆడిక్షన్ ). ఈనాటి యువతరాన్ని దారి మళ్ళించి చెడు మార్గాల్లో నడిపిస్తున్న దురలవాట్లలో మాదక ద్రవ్యాల వినియోగం తీవ్రమైనది. ధూమపానం, మద్యపానం వంటి వ్యసనాల కన్నా తీవ్రమైన ప్రభావం చూపిస్తాయి . ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏడాఇ 5.6 శాతం జనాభా అనగా 185 మిలియన్ల మంది ఇలా మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్నట్లు అంచనాలు తెలుపుతున్నాయి. వీటికి అలవాటు పడిన విద్యార్థులు, యువకులు చదువులు వదిలి సర్వస్వం కోల్పోయి నిర్భాగ్యులౌతున్నారు. ఒకసారి దీనికి బానిసలైన తర్వాత ఎంతటి అకృత్యాలు, నేరాలు చేయడానికి వెనుకాడరు. మాదక ద్రవ్యాల నిరోధానికి భారత ప్రభుత్వం నార్కోటిక్స్, డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సస్ చట్టాన్ని చేసింది. ఈ మత్తు మందులు పండించేవారు, వ్యాపారం చేసేవారు, కలిగివున్నవారు చట్టపరంగా కఠిన శిక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది. హాలుసినోజెన్‌లు తీసుకున్నప్పుడు మనిషి వాస్తవ పరిస్థితికి భిన్నంగా ఆలోచించాలా చేస్తాయి. డెలీరియం అనే దశకు దారి తీసిన తర్వాత రాత్రికి, పగటికి తేడా తెలియదు. ఉదాహరణకు చేతిలో ఫోన్ లేకపోయినా ఫోన్ ఉన్నట్లు ఊహించుకోవడం, కిటికీలను ద్వారాలని భావించడం, లేని మనుషులను ఉన్నట్లుగా ఊహించుకోవడం లాంటివి జరుగుతూ ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. డిస్‌అస్సోసియేటివ్ అనస్థెటిక్స్ లాంటివి తీసుకోవడం వల్ల నొప్పి తెలియకుండా చేస్తాయి. నార్కోటిక్ అనాల్జెసిక్స్ వాడటం వల్ల నొప్పి తగ్గి ఉద్రేకాన్ని కలిగిస్తాయి. ఇవి తీసుకునే వారి భావోద్వేగాలు మారిపోతూ ఉంటాయి.ఓపియం (నల్ల మందు), కొకైన్, హెరాయిన్, డెమెరాల్, డార్వోన్, మార్ఫిన్, మేథాడోన్, వికోడిన్, ఆక్సీకోన్టిన్ ఈ తరహా మాదక ద్రవ్యాల కిందకు వస్తాయి.మాదకద్రవ్యాలకు అలవాటు పడటం వల్ల ఆకలి తగ్గిపోతుంది. నిద్ర పట్టదు. అల్సర్లు, క్రామ్ప్స్ వస్తాయి. జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. నిద్రలో సమస్యలు, మానసిక ఒత్తిడి, మూడ్ స్వింగ్స్, అందరితో పోట్లాటలు చేస్తారు