యూరప్ నిప్పుల గుండం
Actor ProfilePolitician

యూరప్ నిప్పుల గుండం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
యూరప్ నిప్పుల గుండం
Sakshi10 Jul 2026
యూరప్ నిప్పుల గుండం

నిద్ర లేచేసరికే ఒళ్లంతా చెమటలు.. గాల్లో నిప్పులు కురుస్తున్నట్లు అనుభూతి.. ప్రస్తుతం ఫ్రాన్స్, బ్రిటన్‌ దేశస్తుల పరిస్థితిని చూస్తే.. కదలకుండా కూర్చున్నా ప్రాణాలు పోయేలా ఎండలు మండిపోతున్నాయి. వేడి తట్టుకోలేక ఉపశమనం కోసం ఈతకు వెళ్లిన వారిలో ఐదు రోజుల్లోనే ఏకంగా 40 మంది నీట మునిగి మృతి చెందడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఖండంలో మెజారిటీ జనాభా ప్రస్తుతం మునుపెన్నడూ చూడని అత్యంత అసాధారణ ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. సగం దేశానికి గండం ఫ్రాన్స్‌ జాతీయ వాతావరణ సంస్థ ‘మెటియో ఫ్రాన్స్‌’దేశంలోని దాదాపు సగానికి పైగా ప్రాంతాలను అత్యంత ప్రమాదకరమైన ‘రెడ్‌ హీట్‌ వేవ్‌ అలర్ట్‌’పరిధిలోకి తెచ్చింది. పగలు, రాత్రి తేడా లేకుండా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. మృతుల్లో యువకులే అధికం ఫ్రాన్స్‌ ప్రధాని సెబాస్టియన్‌ లెకోర్ను సంక్షోభ సమీక్షా సమావేశం అనంతరం మాట్లాడుతూ.. గత గురువారం నుండి నీట మునిగి చనిపోయిన 40 మందిలో అత్యధికులు యువకులేనని తెలిపారు. ఫ్రాన్స్‌లో ఇళ్లకు, ప్రజా రవాణా వ్యవస్థలకు ఎయిర్‌ కండిషనింగ్‌ సదుపాయం పెద్దగా లేకపోవడంతో స్కూళ్లు, రైళ్ల రాకపోకలు, క్రీడా ఈవెంట్లపై ఈ ఎండల ప్రభావం పడింది. మానవ తప్పిదాల వల్లే వాతావరణంలో ఈ మార్పులు వస్తున్నాయని, రాబోయే ఐదేళ్లలో వాతావరణ రికార్డులు మరిన్ని బద్దలవుతాయని ఐక్యరాజ్యసమితి వాతావరణ విభాగం హెచ్చరిస్తోంది. బ్రిటన్‌ను వణికిస్తున్న వేడి గాలులు ఇటు ఇంగ్లిష్‌ చానల్‌ అవతలి వైపున్న బ్రిటన్‌లోనూ పరిస్థితి తీవ్రంగా ఉంది. బ్రిటన్‌ వాతావరణ సంస్థ బుధ, గురువారాల కోసం ‘రెడ్‌ ఎక్స్‌ట్రీమ్‌ హీట్‌ వార్నింగ్‌’జారీ చేసింది. జూన్‌ నెల చరిత్రలోనే ఇవి అత్యంత గరిష్ట ఉష్ణోగ్రతలు కావచ్చు. దక్షిణ ఇంగ్లాండ్‌లో 37 డిగ్రీలు, ఆగ్నేయ వేల్స్‌లో 35 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. బుధ, గురువారాల్లో తీవ్రత పెరిగి 39 డిగ్రీలు దాటవచ్చని, శుక్రవారం నుండి ఎండలు కాస్త తగ్గుముఖం పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రికార్డులు