
రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్‌స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది. UPSC Prelims Results 2026 Out: దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ 2026 ఫలితాలను సోమవారం విడుదల చేశారు. ఈ ఫలితాల ప్రకారం మెయిన్స్ పరీక్షకు మొత్తం 13,343 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. ఈ ఏడాది సివిల్ సర్వీసెస్ ద్వారా మొత్తం 1,016 ఖాళీలను ప్రకటించారు.. ప్రస్తుతం మెయిన్స్ కోసం షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థుల జాబితాను యూపీఎస్‌సీ వెల్లడించింది. గత ఏడాది 1,087 ఖాళీలకు 1,411 మందిని షార్ట్ లిస్ట్ చేశారు. అభ్యర్థుల ఎంపిక ఇలా.. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ (IAS), ఇండియన్ ఫారిన్ సర్వీసెస్ (IFS), , ఇండియన్ పోలీస్ సర్వీసెస్ (IPS) వంటి పోస్టుల భర్తీ కోసం ఈ పరీక్ష నిర్వహిస్తారు. యూపీఎస్‌సీ పరీక్ష మొత్తం మూడు దశల్లో ఉంటుంది.. ప్రిలిమినరీ, మెయిన్స్ , ఇంటర్వ్యూ (పర్సనాలిటీ టెస్ట్) ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ప్రిలిమ్స్ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు మెయిన్స్ రాయడానికి అర్హత సాధిస్తారు. దీని కోసం రూ.200 ఫీజు చెల్లించి, జూన్ 19 నుండి 28వ తేదీ వరకు అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. యూపీఎస్‌సీ ఫలితాల PDF డౌన్‌లోడ్ చేసుకునే విధానం: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్స్ ప్రిలిమ్స్ PDF డౌన్‌లోడ్ చేయాలంటే, ముందుగా అధికారిక వెబ్‌సైట్ ను ఓపెన్ చేయాలి. అందులో 'Examination' ట్యాప్‌పై క్లిక్ చేస్తే, అక్కడ కనిపిస్తున్న 'Active Examinations' విభాగంలో 'Civil Services Examination 2026 Results' లింక్‌ను వెతకాలి. అక్కడ ఉన్న 'Result PDF' ఫైల్‌పై క్లిక్ చేయడం ద్వారా ఫలితాలను పొందవచ్చు. సివిల్స్ ఫైనల్ ఆన్సర్ కీ