యాదగిరిగుట్ట బోర్డు వివాదం.. కాంగ్రెస్ లో చిచ్చు
Actor ProfilePolitician

యాదగిరిగుట్ట బోర్డు వివాదం.. కాంగ్రెస్ లో చిచ్చు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
యాదగిరిగుట్ట బోర్డు వివాదం.. కాంగ్రెస్ లో చిచ్చు
Telugu Times8 Sept 2026
యాదగిరిగుట్ట బోర్డు వివాదం.. కాంగ్రెస్ లో చిచ్చు

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ నూతన ట్రస్ట్ బోర్డు నియామక వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్‌లో తీవ్ర దుమారం రేపుతోంది. బుధవారం ప్రభుత్వం ప్రకటించిన ఈ బోర్డు నియామకాలు పార్టీ అంతర్గత విభేదాలను ఒక్కసారిగా రోడ్డుపైకి తెచ్చాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా సీనియర్ నేతలను, పార్టీ సొంత క్యాడర్‌ను సంప్రదించకుండా ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాలపై గాంధీభవన్‌తో పాటు సోషల్ మీడియా వేదికగా తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ వ్యవహారం చివరకు న్యూఢిల్లీలోని పార్టీ అధిష్టానానికి అధికారిక ఫిర్యాదుల రూపంలో చేరడం గమనార్హం. ఈ నియామకాలపై మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏకంగా ఒక టీవీ ఛానల్ లైవ్ లోనే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలను, కీలక నేతలను కనీసం సంప్రదించకుండా ప్రభుత్వం ఈ బోర్డును ఎలా ఖరారు చేస్తుందని ఆయన బహిరంగంగానే తప్పుపట్టారు. ఏళ్ల తరబడి కాంగ్రెస్ జెండా మోసిన ఒరిజినల్ కాంగ్రెస్ నేతలకు ప్రాధాన్యత లేదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీలో హాట్ టాపిక్‌గా మారాయి. మరోవైపు, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌ను సైతం ఈ ప్రక్రియలో భాగస్వామ్యం చేయలేదనే ప్రచారం జరుగుతోంది. దేవాలయాల వ్యవహారాలతో నేరుగా సంబంధం ఉండే అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను కూడా సంప్రదించకుండానే ఈ జాబితాను ఖరారు చేశారని, దేవాదాయ శాఖ మంత్రిని పక్కనబెట్టడం వల్లే ఈ వివాదం మరింత ముదిరిందని కాంగ్రెస్ అంతర్గత వర్గాల్లో గట్టిగా చర్చ నడుస్తోంది. ప్రభుత్వం, పార్టీల మధ్య కనీస సమన్వయం లోపించిందనే దానికి ఈ పరిణామాలే నిదర్శనమని విమర్శకులు అంచనా వేస్తున్నారు. ట్రస్ట్ బోర్డులో వినోద్ వెంకటస్వామిని చేర్చడంపై పార్టీ శ్రేణుల్లో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే వారి కుటుంబంలో వివేక్ వెంకటస్వామికి కీలక పదవులు ఉండటం, ఆయన కొడుకు ఎంపీగా విజయం సాధించడం గమనార్హం. ఇలాంటి తరుణంలో మళ్లీ అదే కుటుంబానికి చెందిన వినోద్ వెంకటస్వామికి