యూజర్ నేమ్ ఫీచర్ .. అనుమానాలకు స్పష్టతనిచ్చిన వాట్సప్
Actor ProfilePolitician

యూజర్ నేమ్ ఫీచర్ .. అనుమానాలకు స్పష్టతనిచ్చిన వాట్సప్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
యూజర్ నేమ్ ఫీచర్ .. అనుమానాలకు స్పష్టతనిచ్చిన వాట్సప్
Eenadu2 Sept 2026
యూజర్ నేమ్ ఫీచర్ .. అనుమానాలకు స్పష్టతనిచ్చిన వాట్సప్

సమాధానం: కాదు.. ఆప్షనలే. మీకు కావాలనుకుంటేనే మీరు పేరును రిజర్వ్‌ చేసుకోవచ్చు. లేదంటే నంబరుతోనే కొనసాగించొచ్చు. ప్రశ్న: నాకు కావాల్సిన యూజర్‌నేమ్ అందుబాటులో లేకపోతే..? సమాధానం: కోరుకున్న యూజర్‌నేమ్ అందుబాటులో లేకపోవడానికి కొన్ని కారణాలున్నాయి. ఆ పేరుమీద ఇప్పటికే ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌ యూజర్లు ఉంటే.. వారికే దాన్ని కేటాయిస్తాం. అలాగే సెలబ్రిటీలు, ప్రభుత్వ సంస్థలు, మెటా ధ్రువీకరించిన ఖాతాదారుల పేర్లు కొన్నింటిని ఇప్పటికే రిజర్వ్ చేశాం. వాటిని చట్టబద్ధమైన యజమానులు మాత్రమే క్లెయిమ్‌ చేసుకోవడానికి వీలుంది. ఆ పేర్లను మీరు ఉపయోగించడానికి చేయడానికి ప్రయత్నిస్తే.. అందుబాటులో లేదనే సమాధానం వస్తుంది. కొత్త పేరుకోసం యూజర్‌నేమ్ జనరేటర్‌ ఆప్షన్‌ను వాడుకునే వీలు కల్పిస్తున్నాం. ప్రశ్న: నా పేరిట ఇతరులను మోసం చేయడానికి నా యూజర్‌నేమ్‌ లాంటిదే క్రియేట్ చేసి మెసేజ్‌లు చేస్తే.. మోసపూరిత వ్యక్తులను ఎలా ఆపాలి? సమాధానం: మెసేజింగ్‌ కోసం యూజర్‌నేమ్‌లు ఇంకా అందుబాటులోకి రాలేదు. అవి అందుబాటులోకి వచ్చిన తర్వాత కొత్త వారి నుంచి సందేశం వస్తే.. ఏ దేశం నుంచి అది వచ్చిందో వెల్లడిస్తాం. మొదటిసారి వచ్చినప్పుడు ఒక హెచ్చరిక చేస్తాం. బ్లాక్‌, రిపోర్ట్ వంటి ఆప్షన్లనూ కొనసాగిస్తాం. ప్రశ్న: నా యూజర్‌నేమ్‌ను ఎవరైనా గెస్‌ చేసి, అపరిచితులు మెసేజ్ చేయడానికి వీలు ఉందా..? సమాధానం: వాట్సప్‌లో కొత్తవారి నంబర్‌ కోసం వెతకడానికి అవకాశం లేనట్లే.. యూజర్‌నేమ్‌ను సెర్చ్‌ చేయడానికీ వీలుండదు. అయినప్పటికీ మీరు మరింత భద్రత కోసం యూజర్‌నేమ్ కీ ఆప్షన్‌, వాట్సప్‌కే ప్రత్యేకమైన యూజర్‌నేమ్‌ను ఎంచుకోవడం వంటి మార్గాలున్నాయి. సమాధానం: యూజర్‌నేమ్‌తో పాటు అదనపు భద్రత కోసం ఈ కీని ఉపయోగించుకోవచ్చు. ఇది ఎనేబుల్ అయి ఉంటే.. కొత్త వ్యక్తులు మిమ్మల్ని సంప్రదించడానికి యూజర్‌నేమ్‌తో పాటు ఈ కీ కూడా తెలిసి ఉండాలి. ఈ కీని రీసెట్ చేసుకునే వీలు ఉంటుంది. ప్రశ్న: మెటాలో ఉన్న ఇతర ఖాతాలను (ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌) లింక్‌ చేయాలా..? సమాధానం: ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌