యోగా ఫర్ హెల్తీ ఏంజిగ్ ’ పేరుతో యోగా దినోత్సవం
Actor ProfilePolitician

యోగా ఫర్ హెల్తీ ఏంజిగ్ ’ పేరుతో యోగా దినోత్సవం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
యోగా ఫర్ హెల్తీ ఏంజిగ్ ’ పేరుతో యోగా దినోత్సవం
Andhra Jyothy20 Jun 2026
యోగా ఫర్ హెల్తీ ఏంజిగ్ ’ పేరుతో యోగా దినోత్సవం

ముఖ్యమంత్రి చంద్రబాబు దేశంలోనే విజన్ ఉన్న నాయకుడని యోగా గురు రామ్‌దేవ్ బాబా అన్నారు. యోగా మన సంస్కృతి సంప్రదాయాల్లో భాగమని తెలిపారు. అమరావతి, జూన్ 20: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ‘యోగాంధ్ర’ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా యోగా కార్యక్రమాలను చేపడుతోంది. ఈరోజు(శనివారం) ఉండవల్లి గుహల వద్ద కార్యక్రమాన్ని నిర్వహించారు. యోగా గురు రామ్‌దేవ్ బాబాతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యోగాసనాలు వేశారు. రామ్‌దేవ్ బాబా మాట్లాడుతూ... ముఖ్యమంత్రి చంద్రబాబు దేశంలోనే విజన్ ఉన్న నాయకుడని అన్నారు. గత 30 సంవత్సరాలుగా చంద్రబాబు ఏం అడుగుతారో.. తాము అది చేస్తున్నామని తెలిపారు. యోగా మన సంస్కృతి, సంప్రదాయాల్లో భాగమని రామ్‌దేవ్ బాబా తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు అందర్నీ సమానంగా చూస్తారని.. అందుకే ప్రజలు ఆయన్ను దేవుడిలా భావిస్తారన్నారు. అమరావతి దేవతల రాజధాని అని.. ఇక్కడ 40 శాతం పచ్చదనం, 60 శాతం నిర్మాణాలు ఉంటాయన్నారు. ఇది దేవ భూమి అని వెల్లడించారు. స్విట్జర్లాంట్ కోసం వెళ్లాల్సిన అవసరం లేదని... ఆంధ్రప్రదేశ్ వస్తే చాలని చెప్పారు. ఇక్కడి మామిడికాయలు, అరటిపండ్లు చాలా బాగుంటాయని.. ఎందుకంటే వాటిని సహజ సిద్ధంగా పండిస్తారని తెలిపారు. ఈసారి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ‘యోగా ఫర్ హెల్తీ ఏజింగ్’ పేరుతో నిర్వహిస్తున్నామని రామ్‌దేవ్ బాబా పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం.. ఉండవల్లిలో భారీ ఏర్పాట్లు అన్నదాత సంక్షేమమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యం: మంత్రి అచ్చెన్నాయుడు