యోగా ద్వారా ఆరోగ్య విప్లవం.. యోగాంధ్ర-2026
Actor ProfilePolitician

యోగా ద్వారా ఆరోగ్య విప్లవం.. యోగాంధ్ర-2026

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
యోగా ద్వారా ఆరోగ్య విప్లవం.. యోగాంధ్ర-2026పై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్
Andhra Jyothy17 Jun 2026
యోగా ద్వారా ఆరోగ్య విప్లవం.. యోగాంధ్ర-2026పై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్

అంతర్జాతీయ యోగా దినోత్సవం (జూన్ 21) నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను వేగవంతం చేయాలని సీఎం చంద్రబాబు.. అధికారులను ఆదేశించారు. అమరావతి, జూన్ 17 (ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ యోగా దినోత్సవం (జూన్ 21) నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగే యోగా దినోత్సవ కార్యక్రమాలను సమన్వయంతో, ఘనంగా నిర్వహించేలా అన్ని శాఖలు సమష్టిగా పనిచేయాలని సూచించారు. సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన ‘యోగాంధ్ర–2026’ ఏర్పాట్లపై ఈరోజు (బుధవారం) ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో యోగా దినోత్సవాన్ని ప్రజా ఉద్యమంగా మార్చే దిశగా చర్యలు తీసుకోవాలని సీఎం దిశానిర్దేశం చేశారు. జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఘనంగా నిర్వహించేలా ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రస్థాయి ప్రధాన ఈవెంట్‌గా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. యోగాంధ్ర–2026లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రజల భాగస్వామ్యంతో యోగా ద్వారా ఆరోగ్యకర జీవనశైలిపై అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు. యోగా దినోత్సవాన్ని కేవలం కార్యక్రమంగా కాకుండా ప్రజా ఉద్యమంగా తీర్చిదిద్దాలని సీఎం చంద్రబాబు సూచించారు. శాఖల మధ్య సమన్వయం మరింత బలంగా ఉండాలని, అన్ని ఏర్పాట్లు సమయానికి పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే యోగా ద్వారా ఆరోగ్యకర జీవనశైలి ప్రాముఖ్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఆయుష్ శాఖ అధికారులు, అలాగే ప్రకృతి వైద్యం, యోగా సలహాదారు మంతెన సత్యనారాయణ రాజు పాల్గొన్నారు. వారు యోగా కార్యక్రమాల అమలు, ప్రజల భాగస్వామ్యం పెంపుపై ఈ సమావేశంలో చర్చించారు. సింగపూర్ తర్వాత పెట్టుబడులకు ఏపీనే ఉత్తమ గమ్యస్థానం: సీఎం చంద్రబాబు మోదీ హయాంలో