యాక్టర్ గా హాయిగా బతికేదాన్ని.. ప్రొడ్యూసర్ కష్టం ఇప్పుడర్థమైంది
Actor ProfileActor

యాక్టర్ గా హాయిగా బతికేదాన్ని.. ప్రొడ్యూసర్ కష్టం ఇప్పుడర్థమైంది

Total News1
Movie Updates0
Sources1
యాక్టర్ గా హాయిగా బతికేదాన్ని.. ప్రొడ్యూసర్ కష్టం ఇప్పుడర్థమైంది
NTV Telugu15 Jun 2026
యాక్టర్ గా హాయిగా బతికేదాన్ని.. ప్రొడ్యూసర్ కష్టం ఇప్పుడర్థమైంది

Samantha: సమంత ప్రధాన పాత్రలో నటిస్తూ, స్వయంగా నిర్మించిన వినూత్న చిత్రం ‘మా ఇంటి బంగారం’ జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ప్రీ-రిలీజ్/ట్రైలర్ లాంచ్ వేడుకలో సమంత చాలా ఓపెన్‌గా, ఎమోషనల్‌గా మాట్లాడారు. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ.. “నిజం చెప్పాలంటే ఒక ఏడాదిలో కనీసం రెండు సినిమాలు చేయాలని నాకూ ఉంటుంది. కానీ ఈ ఒక్క సినిమాను మాత్రం ప్రాణం పెట్టి చాలా బాగా చేశాం. అది నా ప్రామిస్. జూన్ 19న మీరే థియేటర్లలో చూస్తారుగా.. ఈ సినిమాతో మనం ఒక్కొక్కరిని కొడతాం చూడు.. ఆ రేంజ్‌లో ఉంటుంది” అంటూ సినిమాపై తనకున్న నమ్మకాన్ని గట్టిగా వ్యక్తపరిచారు. నిర్మాతగా తన అనుభవాన్ని పంచుకుంటూ.. “లాస్ట్ ఫైవ్ డేస్ ప్రొడ్యూసర్‌‌కుఎంత స్ట్రెస్ ఉందో నాకు పూర్తిగా అర్థమైంది. ఇప్పటిదాకా ఒక యాక్టర్ గా చాలా హాయిగా నా లైఫ్ లివ్ చేశాను. సాధారణంగా సినిమా హిట్ అయితే ఆ క్రెడిట్ అంతా యాక్టర్స్, డైరెక్టర్లకే దొరుకుతుంది. కానీ రాత్రింబవళ్లు కష్టపడి సినిమాను సక్సెస్ చేసే నిజమైన వ్యక్తులకు థాంక్స్ చెప్పడానికి నేను ఈ స్టేజ్ వాడుకోవాలనుకుంటున్నాను” అని అన్నారు. “లాస్ట్ వన్ వీక్‌గా మా అసిస్టెంట్ డైరెక్టర్లు మహేష్, శీను, అన్వేష్, వంశీ, కుశాల్.. అస్సలు నిద్రపోలేదు, కనీసం ఇంటికి కూడా వెళ్ళలేదు. శీను అయితే ఇప్పుడు కూడా మిక్సింగ్‌లోనే ఉన్నారు. వసంత్, ప్రహాస్ రాసిన డైలాగ్స్ ఈ సినిమాకు పెద్ద ప్లస్. ఈ సినిమాలో నేను నాచురల్ గా పర్ఫార్మ్ చేశానంటే.. అందులో సగం క్రెడిట్ ఈ డైలాగ్స్‌దే. విఎఫ్ఎక్స్ నిఖిల్, ఎడిటర్ ధర్మేంద్ర గారు, సౌండ్ మిక్సింగ్ అజిత్ గారు డే అండ్ నైట్ పనిచేశారు. పల్లవి డిజైన్ చేసిన శారీ కట్టుకుని యాక్షన్ సీక్వెన్స్ చేయడం చాలా కష్టమైంది. హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రఫర్ లీ విటకర్ ఈ సినిమాలో ఎక్స్‌ట్రార్డినరీ