మహేష్ బాబాయ్ చాలా స్పష్టంగా చెప్పారు
Actor ProfileActor

మహేష్ బాబాయ్ చాలా స్పష్టంగా చెప్పారు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మహేష్ బాబాయ్ చాలా స్పష్టంగా చెప్పారు
Chitrajyothy5 Aug 2026
మహేష్ బాబాయ్ చాలా స్పష్టంగా చెప్పారు

సూపర్‌ స్టార్‌ కృష్ణ.. మహేష్‌ బాబు.. ఆ తర్వాత ఎవరు? దీనికి సమాధానమే ఘట్టమనేని జయకృష్ణ..‘శ్రీనివాస మంగాపురం’ సినిమా ద్వారా తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పరిచయమవుతున్న జయకృష్ణ అరంగేట్రం అంత సునాయాసంగా సాగలేదు. తను హీరో కావడం వెనుక తాతయ్య సూపర్‌స్టార్‌ కృష్ణ ప్రోత్సాహం ఎంతో ఉందంటున్న జయకృష్ణ తొలి ఇంటర్వ్యూ ‘నవ్య’ పాఠకులకు ప్రత్యేకం... తొలి సినిమా అనుభవం ఎలా ఉంది? నవంబర్‌ చివరిలో షూటింగ్‌ ప్రారంభించాం. మూడు రోజుల క్రితమే పూర్తయింది. ఈ ఏడు నెలలు మొత్తం అవుట్‌డోర్‌లోనే చేశాం. ఒక్క రోజు కూడా సెట్‌లో షూట్‌ చేయలేదు. డ్యాన్సులు, ఫైట్లు అన్నీ రోడ్డు మీదే చేశాం. ఈ మధ్యకాలంలో మొత్తం అవుట్‌డోర్‌లో చేసిన సినిమా ఇదేనేమో! ఈ మొదటి సినిమా అందమైన అనుభవాన్ని మిగిల్చింది. షూట్‌కు వెళ్లేముందు కాస్త టెన్షన్‌ పడ్డాను కానీ రషెస్‌ చూశాక- ‘‘అనుకున్నదానికన్నా బాగా చేశావు’’ అని బంగారు తాతయ్య (ఆదిశేషగిరిరావు) మెచ్చుకున్నారు. దాంతో నా కాన్ఫిడెన్స్‌ పెరిగింది. తాత సూపర్‌ స్టార్‌.. బాబాయ్‌ ఇంకో సూపర్‌ స్టార్‌.. ఈ వారసత్వ ఒత్తిడి నీపై ఉందా? చిన్నప్పటి నుంచి వాళ్ల సినిమాలు చూస్తూ పెరిగాను. వాళ్లిద్దరూ శిఖరాలు. వాళ్ల రేంజ్‌ చాలా పెద్దది. వాళ్ల వారసత్వం నాకొక అవకాశం. వారసత్వ ఒత్తిడి కన్నా.. ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని నన్ను నేను నిరూపించుకోవాలనే ఒత్తిడే ఎక్కువగా ఉంది. హీరో కావాలని ఎప్పుడు అనుకున్నావు? చిన్నప్పుడు చాలా అస్పష్టత ఉండేది. ఎందుకంటే చిన్నప్పుడు నేను బొద్దుగా ఉండేవాడిని. అందరూ ఏడిపిస్తూ ఉండేవారు. బొద్దుగా ఉన్న పిల్లలను ఏడిపించటం మామూలే కదా! అది పెద్ద సమస్య కాదు. అయితే పెద్దయిన తర్వాత ఏం చేయాలనే విషయంపై అంత స్పష్టత లేదు. బాబాయ్‌ సినిమాలు చూస్తూ పెరగటం వల్ల హీరో అవ్వాలని ఉండేది. కానీ హీరోగా సెట్‌ అవుతానా? లేదా అనే అనుమానం మాత్రం ఉండేది. నాకు 16 ఏళ్ల