మహేష్ బాబు నెక్ట్స్ మూవీ ఫిక్స్
Actor ProfileActor

మహేష్ బాబు నెక్ట్స్ మూవీ ఫిక్స్

Total News1
Movie Updates0
Sources1
మహేష్ బాబు నెక్ట్స్ మూవీ ఫిక్స్, బాక్సాఫీసు వద్ద అరాచకమే.. పెద్ది డైరెక్టర్ కాదు
Asianet News Telugu16 Jun 2026
మహేష్ బాబు నెక్ట్స్ మూవీ ఫిక్స్, బాక్సాఫీసు వద్ద అరాచకమే.. పెద్ది డైరెక్టర్ కాదు

సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు ఓ వైపు ఇంటర్నేషనల్‌ రేంజ్‌ ఫిల్మ్ లో నటిస్తున్నారు. రాజమౌళితో వారణాసి సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ప్రపంచ మార్కెట్‌ని టార్గెట్‌ చేస్తూ, దీన్ని ఆడియెన్స్ ముందుకు తీసుకెళ్లే ప్లాన్‌ చేస్తున్నారు జక్కన్న. సుమారు ఐదు వేల కోట్ల కలెక్షన్లు టార్గెట్‌గా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇప్పుడు మహేష్‌ కి సంబంధించిన మరో ఆసక్తికర విషయం వైరల్‌గా మారింది. ఆయన కొత్త సినిమాకి సంబంధించిన అప్‌ డేట్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మహేష్‌ బాబు నెక్ట్స్ సినిమా ఎవరితో అనేది ఇప్పటి వరకు క్లారిటీ లేదు. ఆయన ప్రస్తుతం రాజమౌళి సినిమాలో నటిస్తోన్న నేపథ్యంలో ఇప్పట్లో మరో సినిమాకి ఒప్పుకునే పరిస్థితి కష్టమనే చెప్పాలి. `వారణాసి` విడుదలయ్యాక, దాని రేంజ్‌ని బట్టి కొత్త ప్రాజెక్ట్ ని ప్లాన్‌ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. సాధారణంగా రాజమౌళితో సినిమా చేసిన ఏ హీరో అయినా ఇదే ప్లాన్‌ చేస్తారు. జక్కన మూవీ ఏ స్థాయికి వెళ్తుందో, దాన్ని బట్టి నెక్ట్స్ ఎలాంటి సినిమా చేయాలనేది ప్లాన్‌ చేసుకుంటారు. కానీ ఇప్పుడు మహేష్‌ బాబు తన కొత్త సినిమా విషయంలో ముందుగానే రెడీ అవుతున్నారట. మహేష్‌ నెక్ట్స్ మరో సంచలన దర్శకుడు సందీప్‌రెడ్డి వంగాతో ప్లాన్‌ చేస్తున్నట్టు సమాచారం. నిర్మాత అనిల్‌ సుంకర ఈ కాంబినేషన్‌ని సెట్‌ చేసే పనిలో ఉన్నారు. వీరిద్దరితో సినిమా చేయాలని భావిస్తున్నారు. మహేష్‌ బాబుతో అనిల్‌ సుంకరకి మంచి రిలేషన్‌ ఉంది. పైగా మహేష్‌తో సినిమా చేయాలని సందీప్‌ రెడ్డి వంగాకి కూడా ఉంది. నిజానికి గతంలోనూ వీరి కాంబినేషన్‌లో సినిమా రావాల్సి ఉంది. `యానిమల్‌` మూవీ మహేష్‌ చేయాల్సింది అంటుంటారు. అప్పుడు మిస్‌ అయిన ఈ కాంబినేషన్‌ని ఇప్పుడు మళ్లీ సెట్‌ చేసే పనిలో ఉన్నారు అనిల్‌ సుంకర. మహేష్‌ బాబు, సందీప్‌ రెడ్డి కాంబినేషన్‌