
Gold, Silver Rates: బంగారం కొనుగోలు చేయాలనే వారికి ఇది పెద్ద గుడ్‌న్యూస్. బంగారం ధర మరింత దిగజారుతోంది. రోజురోజుకు ధర అమాంతంగా పడిపోతోంది. బులియన్ మార్కెట్ ప్రారంభం కాగానే బంగారం ధరలు భారీగా తగ్గగా, వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. గత కొన్ని రోజులుగా అంతర్జాతీయ మార్కెట్‌లో కొనసాగుతున్న ఒడిదుడుకులు, అమెరికా డాలర్ బలపడటం, పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం. అలాగే భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొంత తగ్గుముఖం పట్టడం వంటి అంశాల ప్రభావంతో దేశీయ మార్కెట్‌లో కూడా బంగారం ధరలు గణనీయంగా తగ్గినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అయితే పెళ్లిళ్ల సీజన్‌లో, ఇతర శుభకార్యాలు లేదా పెట్టుబడి కోసం బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది పెద్ద ఊరటనిచ్చే అంశంగా చెప్పవచ్చు. గుడ్ రిటర్న్స్ వెల్లడించిన తాజా ధరల ప్రకారం.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై ఏకంగా 1800 రూపాయల వరకు తగ్గుముఖం పట్టింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 1650 రూపాయల వరకు తగ్గింది. ధరలు తగ్గిన తర్వాత 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 1,40,130 రూపాయల వద్ద ట్రేడవుతుండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,28,450 వద్ద ట్రేడవుతోంది. అలాగే హైదరాబాద్, విజయవాడలో కూడా ఇదే ధర కొనసాగుతోంది. ఇక వెండి విషయానికొస్తే.. హైదరాబాద్, చెన్నై, కేరళలో కిలో వెండి ధర రూ.2,44,900 వద్ద కొనసాగుతుండగా, అదే ఢిల్లీ, ముంబై, బెంగళూరు, ఇతర నగరాల్లో కిలో వెండి 2,35,000 వద్ద ట్రేడవుతోంది. ఈరోజు దేశీయ కమోడిటీ ఫ్యూచర్స్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలపై ఒత్తిడి కనిపిస్తోంది. డాలర్ బలపడటం, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచుతుందనే భయాల నేపథ్యంలో బలహీనమైన ప్రపంచ సంకేతాల కారణంగా ఈ ఒత్తిడి ఏర్పడింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో ఆగస్టు కాంట్రాక్ట్ డెలివరీతో ఉన్న బంగారం 10 గ్రాములకు రూ