
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సోమవారం మహిళా క్రికెటర్ల కోసం ఒక కీలకమైన ముందడుగు వేసింది. ప్రసవం తర్వాత తిరిగి మైదానంలోకి అడుగుపెట్టేందుకు వీలు కల్పించే మార్గదర్శకాలను (గైడ్‌లైన్స్) విడుదల చేసింది. మాతృత్వం కారణంగా మహిళా క్రికెటర్ల కెరీర్ ముగిసిపోకూడదనే లక్ష్యంతో, వారికి అవసరమైన మద్దతును అందించేందుకు ఈ కొత్త పాలసీని తీసుకొచ్చింది. మాతృత్వం, ప్రొఫెషనల్ క్రికెట్ రెండూ ఏకకాలంలో సాధ్యమేనని చాటిచెప్పడం ఈ మార్గదర్శకాల ముఖ్య ఉద్దేశం.ఈ గైడ్‌లైన్స్‌లో భాగంగా ‘6-R’ ఫార్ములాను ఐసీసీ ప్రతిపాదించింది. ఇందులో రెడీ (సిద్ధం కావడం), రివ్యూ (సమీక్ష), రీస్టోర్ (పునరుద్ధరణ), రీకండిషన్ (పునఃస్థితికి తీసుకురావడం), రిటర్న్ (తిరిగి ఆడటం), రిఫైన్ (మెరుగుపరచడం) అనే ఆరు దశలు ఉంటాయి. శారీరకంగా కోలుకోవడం నుంచి మొదలుకొని, వైద్య సమీక్షలు, నెమ్మదిగా శిక్షణ ప్రారంభించడం, క్రికెట్‌కు అవసరమైన కండిషనింగ్ సాధించడం, పోటీల్లోకి తిరిగి రావడం, ఆ తర్వాత కూడా ఆరోగ్యాన్ని పర్యవేక్షించడం వరకు ప్రతీ అంశాన్ని ఈ ప్రణాళికలో పొందుపరిచారు.ఆస్ట్రేలియా జట్టు డాక్టర్, ఐసీసీ మెడికల్ అడ్వైజరీ కమిటీ సభ్యురాలు డాక్టర్ ఫిలిప్పా ఇంగే మాట్లాడుతూ, "ఈ మార్గదర్శకాల ముఖ్య ఉద్దేశం.. బిడ్డకు జన్మనివ్వడం కెరీర్‌కు ముగింపు కాదని క్రీడాకారిణులకు భరోసా ఇవ్వడమే. చాలా దేశాల బోర్డులకు గతంలో ఇలాంటి పాలసీలు లేవు. అందుకే అన్ని దేశాలకూ అనుకూలంగా ఉండేలా, వారి అవసరాలకు తగ్గట్టు మార్చుకునేలా ఈ గైడ్‌లైన్స్‌ను రూపొందించాం. ఇది ఒక టెంప్లేట్ లాంటిది. ప్రతి క్రీడాకారిణి, వారి కుటుంబ అవసరాలకు అనుగుణంగా మద్దతు అందించాలి" అని వివరించారు.ఈ మార్గదర్శకాల ప్రకారం