
మహారాష్ట్ర విపక్ష కూటమి మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతున్నట్లు కనిపిస్తోంది. బుధవారం సాయంత్రం జరిగిన కీలక వ్యూహరచన సమావేశానికి కూటమికి చెందిన 60 మంది ఎమ్మెల్యేలలో ఏకంగా 23 మంది గైర్హాజరు కావడం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. హాజరుకాని వారిలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్, సీనియర్ నేత జయంత్ పాటిల్ వంటి ఉద్దండులు ఉండటం కూటమిలోని ఐక్యతపై తీవ్ర సందేహాలను రేకెత్తిస్తోంది. వ్యక్తిగత కారణాల వల్ల వారు హాజరు కాలేదని చెబుతున్నా, అసలు కారణాలు వేరే ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది.ఈ సమావేశానికి కాంగ్రెస్ నేతలు నానా పటోలే, విజయ్ వడెట్టివార్ కూడా హాజరు కాలేదు. విజయ్ వడెట్టివార్ అనారోగ్యంతో ఉన్నారని ఆయన కార్యాలయం తెలిపింది. అయితే, కాంగ్రెస్ రాష్ట్ర యూనిట్ చీఫ్ హర్షవర్ధన్ సప్కల్, శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ వంటి వారు హాజరయ్యారు. ఇటీవలే ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన ఆరుగురు ఎంపీలు ఏక్‌నాథ్ షిండే వర్గంలో చేరిన నేపథ్యంలో ఈ పరిణామం జరగడం ఎంవీఏ భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చింది.ఈ పరిణామాలపై ఉద్ధవ్ ఠాక్రే తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 'మనం నిజంగా కలిసే ఉన్నామా?' అని ఆయన ప్రశ్నించారు. పార్టీ ఫిరాయించిన ఎంపీల గురించి మాట్లాడుతూ.. "వెళ్లిపోయిన వారిని వెళ్లనివ్వండి. మనతో ఉన్నవారిపై దృష్టి పెడదాం" అని నేతలకు పిలుపునిచ్చారు. అదే సమయంలో "మనం కలిసి ఉన్నామని చెబుతున్నాం. కానీ సభలో మహా వికాస్ అఘాడీగా మనం ఐక్యంగా ఉన్నామా? సమస్యలను కలిసికట్టుగా లేవనెత్తుతున్నామా?" అని