అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఈరోజు భారీగానే తగ్గాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 17 డాలర్ల మేర దిగివచ్చింది. దీంతో ఔన్స్ బంగారం ధర 4064 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 0.66 శాతం మేర పడిపోయి 58 డాలర్ల స్థాయిలో ట్రేడవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఈరోజు భారీగానే తగ్గాయి. 24 క్యారెట్ల మేలిమి బంగారం రేటు 10 గ్రాములకు రూ.930 మేర తగ్గింది. దీంతో తులం రేటు రూ. 1,43,020 వద్దకు దిగివచ్చింది. అలాగే 22 క్యారెట్ల ఆభరణాల గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ.850 మేర తగ్గింది. దీంతో తులం ఆభరణాల గోల్డ్ రేటు రూ. 1,31,100 వద్దకు తగ్గింది. బంగారం ధరలు భారీగా తగ్గినప్పటికీ వెండి రేటు మాత్రం గత మూడు రోజుల నుంచి స్థిరంగానే కొనసాగుతోంది. హైదరాబాద్ మార్కెట్లో ఈరోజు కిలో వెండి రేటు రూ. 2,45,000 మార్క్ వద్ద ట్రేడవుతోంది. రికార్డ్ గరిష్ఠాల నుంచి దాదాపు సగం మేర తగ్గడం గమనార్హం. ప్రముఖ జువెలరీ సంస్థ లలితా జువెలరీల్లో ఈరోజు బంగారం ధరలు తగ్గాయి. 22 క్యారెట్ల ఆభరణాల బంగారం రేటు 1 గ్రాముకు రూ.85 మేర తగ్గింది. దీంతో గ్రాము గోల్డ్ రేటు రూ.13,110 వద్ద ట్రేడవుతోంది. ఇక 10 గ్రాముల బంగారం రేటు రూ.850 తగ్గి రూ.1,31,100 వద్ద అమ్ముడవుతోంది. రచయిత గురించిబండ తిరుపతిబండ తిరుపతి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. 2023లో సమయంలో చేరిన తిరుపతి.. బిజినెస్ రంగానికి సంబంధించి తాజా వార్తలతో పాటు పర్సనల్ ఫైనాన్స్, పెట్టుబడులు, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్ న్యూస్, బంగారం వెండి ధరలపై ఎప్పటికప్పుడు అప్‌డేట్లు అందిస్తున్నారు. ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్‌తో పాటు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారం సైతం
Actor ProfileCelebrity
మళ్లీ మొదలైన యుద్ధం.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఈరోజు తులం గోల్డ్ ఎంతకు తగ్గిందంటే
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•12 Aug 2026
మళ్లీ మొదలైన యుద్ధం.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఈరోజు తులం గోల్డ్ ఎంతకు తగ్గిందంటే