
ఈ వారం మార్కెట్ గమనంపై నిపుణుల అభిప్రాయం పశ్చిమాసియాలో మళ్లీ అగ్గి రాజుకుంది. సీజ్‌ఫైర్‌ను ఉల్లంఘించారంటూ... ఇరాన్–అమెరికా దాడులు, ప్రతిదాడులతో ఈ ప్రాంతం మళ్లీ అట్టుడికింది. తాజా భౌగోళిక రాజకీయ పరిణామాల సెగ ముడిచమురు ధరలపై చూపే ప్రభావం ఈ వారం మార్కెట్ల గమనాన్ని నిర్దేశించనుందనేది విశ్లేషకులు అభిప్రాయం. సూచీలు తీవ్ర ఆటుపోట్లకు గురయ్యే అవకాశం ఉందంటున్నారు. అలాగే, దేశీయంగా వెలువడే పలు స్థూల ఆర్థిక గణాంకాలు, రూపాయి మారకంలో హెచ్చుతగ్గులు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరు, రుతుపవనాల కదలికలపై కూడా ఇన్వెస్టర్లు ఫోకస్ చేయనున్నారు. హార్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకపై ఇరాన్ డ్రోన్ దాడి చేయడంతో అమెరికా అగ్గిమీద గుగ్గిలమైంది. ఇరాన్‌లోని మిసైల్, డ్రోన్ నిల్వ కేంద్రాలే లక్ష్యంగా అమెరికా ఎటాక్ చేసింది. మరోమారు సీజ్‌ఫైర్‌ను ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని అగ్రరాజ్యం హెచ్చరించింది. మరోపక్క ఇరాన్ కూడా ప్రతిదాడులకు దిగింది. దీంతో పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలకు దారితీస్తోంది. వెరసి ఈ వారం క్రూడ్ ధరలపై ఇది ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. శాంతి ఒప్పందంపై ఆశలతో ముడిచమురు ధరలు చల్లారిన సంగతి తెలిసిందే. బ్రెంట్ క్రూడ్ 75 డాలర్ల దిగువకు, అంటే యుద్ధం పూర్వపు స్థాయికి చేరింది. తాజా పరిణామాలతో క్రూడ్ ధరలు మళ్లీ పుంజుకోవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో మార్కెట్లలో తీవ్ర ఒడిదుడులకులు ఉండొచ్చనేది నిపుణుల విశ్లేషణ. ‘పశ్చిమాసియాలో తాజా టెన్షన్లను ఇన్వెస్టర్లు నిశితంగా గమనించనున్నారు. ఒకపక్క శాంతి చర్చల ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ... అమెరికా, ఇరాన్ మధ్య చోటు చేసుకున్న దాడులతో భౌగోళిక రాజకీయ రిసు్కలు ఇంకా తొలగిపోలేదని మార్కెట్లకు సంకేతాలిస్తున్నాయి. చర్చల్లో సానుకూల ఫలితాలు, ఉద్రిక్తతలు సద్దుమణిగితే రిస్క్ సెంటిమెంట్ మెరుగవుతుంది ఒకవేళ దాడులు తీవ్రమైతే ప్రపంచ వృద్ధి, ఇంధన మార్కెట్లపై అంచనాలు తారుమారవుతాయి’ అని ఆన్‌లైన్ ట్రేడింగ్, వెల్త్‌టెక్ సంస్థ ఎన్రిచ్ మనీ సీఈఓ పోన్ముడి ఆర్ పేర్కొన్నారు. గణాంకాలపై ఫోకస్... ఈ వారం దేశీయంగా