
ఈమధ్య కాలంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కి ఏమైందో అర్దం కావడం లేదు. మైక్ పట్టుకోగానే తడబడుతున్నాడు. అలా తడబడి ట్రోలింగ్ కి గురవుతున్నాడు. ఈమధ్య కాలంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కి ఏమైందో అర్దం కావడం లేదు. మైక్ పట్టుకోగానే తడబడుతున్నాడు. అలా తడబడి ట్రోలింగ్ కి గురవుతున్నాడు. మొన్నటికి మొన్న క్రికెటర్ ని ఫుడ్ బాల్ ప్లేయర్ అన్నాడు.. ఆ తరువాత నిర్మాత వెన్నుపోటు అంటూ నోరు జారాడు. ఇక ఇప్పుడు మరోసారి నేషనల్ మీడియాలో నోరుజారీ దొరికిపోయాడు. దీంతో సోషల్ మీడియాలో నెటిజన్ల నుండి ఊహించని రేంజ్‌లో ట్రోలింగ్‌ను ఎదుర్కొంటున్నాడు. అసలేమైంది అంటే.. ప్రతి ఏడాది రిపబ్లిక్ టీవీ నెట్‌వర్క్ నిర్వహించే వార్షిక జాతీయ సమ్మిట్ ఢిల్లీలో జరిగింది. ఇందులో దేశ విదేశాలకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సినీ సెలబ్రిటీలు పాల్గొని వివిధ అంశాలపై చర్చిస్తారు. ఈ ఏడాది జరిగిన ఈ సమ్మిట్ కి ది న్యూ ఏజ్ మెగాస్టార్ గా రామ్ చరణ్ హాజరయ్యాడు. ఎన్నో అంశాల గురించి చర్చించిన చరణ్.. బాలీవుడ్ తో పాటు ఇండస్ట్రీని షేక్ చేసిన ధురంధర్ సినిమా గురించి మాట్లాడాడు. తాను గత వారమే ఈ చిత్రాన్ని ఓటీటీలో చూశాను అని, చాలా టెర్రిఫిక్ మూవీ అని చెప్పుకొచ్చాడు. ఇక్కడే చరణ్ దొరికిపోయాడు. ధురంధర్ ది రివెంజ్ మార్చి 19 న రిలీజ్ అయ్యింది. ఆ నెక్స్ట్ డేనే చరణ్ ఈ సినిమా గురించి ఎక్స్ లో రివ్యూ ఇచ్చాడు. సినిమా చాలా గ్రిప్పింగ్‌గా ఉందని, నటించినవారందరూ చాలా బాగా చేశారని చెప్పుకొచ్చాడు. ఆయన పెట్టిన ట్వీట్ అప్పట్లో ఫ్యాన్స్‌కు బాగానే జోష్ ఇచ్చింది. ఇక ఇప్పుడు చరణ్.. ధురంధర్ సినిమాను ఓటీటీలో చూశాను అని చెప్పడం సంచలనంగా మారింది. థియేటర్లలో చూశానని అప్పుడు ట్వీట్ వేసింది నిజమైతే